Begin typing your search above and press return to search.

బుట్ట‌బొమ్మ‌లా ముస్తాబైన క‌ళావ‌తి!

By:  Tupaki Desk   |   14 May 2022 2:30 PM GMT
బుట్ట‌బొమ్మ‌లా ముస్తాబైన క‌ళావ‌తి!
X
ఎట్ట‌కేల‌కు 'స‌ర్కారు వారి పాట' ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేసింది. ఇందులో హీరోయిన్ గా నటించిన కీర్తి సురేష్ యువ‌త‌లో క‌ళావ‌తిగా ఫేమ‌స్ అవుతుంది. సినిమాకొచ్చిన నెగిటివ్ టాక్ ప‌న్క‌న‌బెట్టి పాజిటివ్ వైబ్ లో చూస్తే క‌ళావ‌తి కెరీర్ ఎలా ఉండ‌బోతుంది?

అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కీర్తి సురేష్ కి ఇప్ప‌టివ‌కూ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే ఛాన్స్ రాలేదు. కోలీవుడ్ లో విజ‌య్ లాంటి హీరోల‌తో నటించింది గానీ..టాలీవుడ్ ఆ అవకాశం మ‌హేష్ సినిమాతోనే వ‌చ్చింది.

'మ‌హాన‌టి' త‌ర్వాత కీర్తి సురేష్ కి ఈ సినిమానే మంచి పేరు తీసుకొస్తుంది. మ‌ధ్య‌లో 'గుడ్ లక్ స‌ఖి' లాంటి లేడీ ఓరియేంటెడ్ సినిమాల్లో న‌టించినా ఫెయిల్యూర్ వెక్కిరించింది. కీర్తికి టాలీవుడ్ లో అవ‌కాశాలు రాక‌పోవ‌డానికి కార‌ణంగా గ్లామ‌ర్ ఎలివేష‌న్ల‌కి నో చెబుతుంది అన్న రీజ‌న్ తోనూ మేక‌ర్స్ ప‌క్క‌న‌బెట్టిన‌ట్లు చాలా కాలంగానే వినిపిస్తుంది. అయితే కళావ‌తి స‌హా ఇటీవల సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న కీర్తి ఫోటోలు చూస్తుంటే కాస్తో ..కూస్తో స‌డలించినట్లే క‌నిపిస్తుంది.

తాజాగా కీర్తి సురేష్ కొత్త ఫోటో ఒక‌టి నెట్టింట దుమారం రేపుతుంది. ప‌సుపు వ‌ర్ణంల పూల‌ గౌను ధ‌రించి అమ్మ‌డు కెమెరాకి ఫోజులిచ్చింది. ఇందులో కీర్తి థై ఎలివేష‌న్స్ హైలైట్ గా నిలిచాయి. ప‌లుచ‌ని మేక‌ప్ తో మ్యాచింగ్ చెవిపోగులు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కూ కీర్తీ ఈ రేంజ్ లో థై ఎలివేష‌న్స్ ఎక్క‌డా ఇవ్వ‌లేదు. గౌను ధ‌రించి థై మంట‌లు రేప‌డం ఇదే తొలిసారి.

కీర్తి ఫోటో షూట్ అంటే కాస్ట్యూమ్స్ దాదాపు ఒళ్లంతా కప్పేసినట్లే ఉంటాయి. డిజైర్ దుస్తులని పేరుకు త‌ప్ప‌..వాటిలో అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కు ఏమాత్రం ఛాన్స్ ఉండ‌దు. కీర్తి డిజైన‌ర్స్ త‌న అభిరుచికి త‌గ్గ‌ట్టుగానే దుస్తుల్ని డిజైన్ చేయిస్తుంది. కానీ తాజా పిక్ మాత్రం గ‌తం కంటే భిన్నంగా ఉంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో యువ‌త‌లో హాట్ టాపిక్ గా మారింది. జెబ్బ‌ల గౌనులో బుట్ట‌బొమ్మ మాదిరి మ‌నోహ‌రంగా క‌నిపిస్తూ యువ‌త‌ని ఆక‌ట్టుకుంటుంది.

కీర్తి సినిమాల విష‌యానికి వ‌స్తే నేచుర‌ల్ స్టార్ నాని స‌ర‌స‌న 'ద‌స‌రా'లో న‌టిస్తోంది. ఈ చిత్రానికి శ్రీకాంత్ అనే కొత్త కుర్రాడు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అలాగే మెగాస్టార్ చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 'భోళా శంక‌ర్' లోనూ ఛాన్స్ అందుకుంది. ప్ర‌స్తుత‌తానికి ఈ రెండు ప్రాజెక్ట్ లే చేతిలో ఉన్నాయి. కొత్త అవ‌కాశాల కోసం వెయిట్ చేస్తోంది.