డివైడ్ టాక్ తోనే వసూళ్లు రాబట్టింది

Thu Apr 18 2019 13:29:35 GMT+0530 (IST)

Kalank Movie Gets Huge collections With Mixed talk

నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన బాలీవుడ్ మల్టీ స్టారర్ కళంక్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల నుంచి క్రిటిక్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేకపోయింది. ట్రైలర్ దశలోనే దీని మీద నెలకొన్న అనుమానాలు నిజం చేస్తూ మరో ఫ్లాప్ అయ్యే దిశగా ప్రయాణం చేస్తోందని ప్రాధమిక రిపోర్ట్స్ ని బట్టి అర్థమవుతోంది. అయితే ఓపెనింగ్స్ మాత్రం బ్రహ్మాండంగా దక్కాయి.లాంగ్ వీకెండ్ ని టార్గెట్ చేసి నిర్మాతలు దీన్ని ప్లాన్ చేయడంతో మొదటి రోజు 22 నుంచి 24 కోట్ల మధ్యలో కలెక్షన్లు వచ్చాయని ట్రేడ్ మాట. వరుణ్ ధావన్-అలియా భట్ ల వ్యక్తిగత కెరీర్లలో ఇదే హయ్యస్ట్ ఓపెనింగ్ ఫిగర్ గా నమోదయ్యయింది. ఒకవేళ పాజిటివ్ టాక్ తో పాటు రివ్యూలు ఫేవర్ గా వచ్చి ఉంటే ఆకాశమే హద్దుగా దూసుకుపోయేదని విశ్లేషకుల అంచనా. రేపు గుడ్ ఫ్రైడే తో పాటు రెండు రోజుల వీకెండ్ ని కనక కళంక్ వాడుకుంటే సేఫ్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి

రెండు దశాబ్దాల తర్వాత సంజయ్ దత్ మధురి దీక్షిత్ కలిసి నటించిన మూవీగా కూడా కళంక్ ప్రేక్షకులను ప్రత్యేకంగా ఆకర్షించింది. అయితే అభిషేక్ వర్మన్ దర్శకత్వం ఆశించిన స్థాయిలో లేకపోవడంతో పాటు లెంత్ మూడు గంటలకు దరిదాపుల్లో వెళ్ళడం కొంత మేర అసహనాన్ని కలిగించింది. మల్టీ ప్లెక్సుల వరకు ఇంకో రెండు మూడు రోజులు ధోకా లేదు కాని బీసి సెంటర్స్ లో ఎంతమేరకు నిలుస్తుంది అనే దాని మీదే కళంక్ ఫైనల్ స్టేటస్ ఆధారపడి ఉంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ కం రివ్యూయర్ తరన్ ఆదర్శ్ తీవ్రంగా నిరాశ పరిచిన చిత్రంగా కళంక్ ని కామెంట్ చేయడం గమనార్హం.