Begin typing your search above and press return to search.

ఘోస్ట్ కంట‌ ప‌డిన ఆ ఇద్ద‌రు భామ‌లు మ‌టాషే!

By:  Tupaki Desk   |   21 Sep 2021 1:30 AM GMT
ఘోస్ట్ కంట‌ ప‌డిన ఆ ఇద్ద‌రు భామ‌లు మ‌టాషే!
X
పెళ్ల‌యిన భామ‌ల‌కు క‌థానాయిక‌లుగా అవ‌కాశాలు ఇవ్వ‌రు..! ఎందుకిలా.. అందుకు కార‌ణ‌మేమిటి? అంటే.. ఇటీవ‌ల‌ కాజ‌ల్ ఎపిసోడ్ ని విశ్లేషిస్తున్నారు. చంద‌మామ కాజ‌ల్ త‌న పెళ్లికి ముందు బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టుల‌కు క‌మిట‌య్యారు. కానీ ఇప్పుడు వాటిలో చాలా వ‌దులుకోవాల్సిన ప‌రిస్థితి ఉందని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఇటీవ‌లే బిజినెస్ మేన్ కం ఫ్రెండు గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన కాజ‌ల్ తొలి శిషువును ఆశిస్తోంద‌ని క‌థ‌నాలు వైర‌ల్ అయ్యాయి.

దీన‌ర్థం సినిమాల్లో న‌టించ‌కుండా కొన్నాళ్ల పాటు వైదొల‌గ‌డ‌మే. ఇప్పుడు కింగ్ నాగార్జున న‌టిస్తున్న ఘోస్ట్ కి ఊహించ‌ని ప‌రిణామం త‌లెత్తింది. ఈ సినిమాలో న‌టించ‌లేన‌ని చంద‌మామ కాజ‌ల్ ద‌ర్శ‌క‌హీరోల‌కు తెలిపార‌ట‌. ప్ర‌స్తుతం గ‌ర్భిణిగా ఉన్న కాజ‌ల్ ఇలాంటి యాక్ష‌న్ సినిమాల‌తో సాహ‌సాలు చేయ‌డం స‌ముచితం కాద‌నేది గుసగుస‌.

ఇక కాజ‌ల్ ఈ సినిమా నుంచి వైదొల‌గ‌గా వేరొక‌ క‌థానాయిక కోసం ఇప్ప‌టికే నాగ్ బృందం వెతుకుతున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌స్తుతం సీనియ‌ర్ భామ‌ల్లో కాల్షీట్ల అవైల‌బిలిటీ ఎవ‌రికి ఉంది? అన్న‌ది ప‌రిశీలిస్తే ఇంత‌కుముందు కింగ్ లో న‌టించిన త్రిష‌కు మ‌రోసారి నాగ్ ఆఫ‌ర్ ఇచ్చేందుకు ప‌రిశీలిస్తున్నార‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అలాగే ఇప్ప‌టివ‌ర‌కూ ఇలియానా నాగ్ స‌ర‌స‌న న‌టించ‌లేదు. త‌న‌కు కూడా తెలుగులో కంబ్యాక్ కోసం మంచి ఆఫ‌ర్ కావాలి. అందుకే ఘోస్ట్ లో ఇలియానాకు అవ‌కాశం ఉండే వీలుంద‌ని టాక్ వినిపిస్తోంది. అయితే ఆ ఇద్ద‌రిలో ఎవ‌రిని తుదిగా ఛాన్స్ వ‌రిస్తుందో చూడాలి.

ఒక‌వేళ సీనియ‌ర్ న‌టి శ్రీ‌య‌కు అవ‌కాశం ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని కూడా ఓ వైపు క‌థ‌నాలొస్తున్నాయి. శ్రీ‌య ఇప్ప‌టికే ముంబైలో సెటిలై టాలీవుడ్ బాలీవుడ్ లో న‌టించేందుకు స‌ర్వ‌స‌న్నాహ‌కాల్లో ఉన్న సంద‌ర్భంగా శ్రీ‌య‌కు ఛాన్స్ లేక‌పోలేదు. ఎవ‌రైనా యువ‌క‌థానాయిక‌ను ఎంపిక చేయాల్సి వ‌స్తే ఎవ‌రు? అన్న‌ది కింగ్ నాగార్జున బృందం వెల్ల‌డించాల్సి ఉంటుంది. ప్రవీణ్ సత్తారు `ఘోస్ట్` చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇటీవల ప్రారంభ‌మైంది. ఇప్ప‌టికే కొంత భాగం చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసారు. క‌థానాయిక‌తో స‌న్నివేశాలు త‌దుప‌రి తెర‌కెక్కించాల్సి ఉంటుంది.