కాజల్ బేకరీ ఐటెమ్స్ తినాలంటే ఏం చేయాలి?

Sat May 30 2020 10:15:46 GMT+0530 (IST)

Kajal turns an expert baker this lockdown

క్వారంటైన్ టైమ్ ని ఒక్కొక్కరూ ఒక్కోలా ఎంజాయ్ చేస్తున్నారు. సెలబ్రిటీలు అయితే మరీనూ.. కొందరు బాత్రూములు కడిగితే .. మరికొందరు వంటింట్లో గరిటె తిప్పారు. ఇంకొందరు ఇళ్లు ఊడ్చి ఫర్నీచర్ శుభ్రపరిచారు. చాలా మంది మొక్కలు పెంపకం వంటి వ్యాపకాలతో సరిపెట్టుకున్నారు. చిరంజీవి లాంటి అగ్రనటుడు సూర్యోదయాన్ని ఆస్వాధిస్తూ ఇంట్లోనే ఉన్నారు. సీసీసీ సేవల్ని పర్యవేక్షించారు. పలువురు బాలీవుడ్ నాయికలు ఇండ్లలో యోగా- మెడిటేషన్ .. జిమ్ అంటూ ఎవరికి వారు యూనిక్ అని ప్రూవ్ చేశారు.ఇకపోతే అందాల కాజల్ ఈ లాక్ డౌన్ సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంది? అంటే.. కాజల్ ది బెస్ట్ అనే రేంజు వ్యాపకాలే పెట్టుకుంది. గత రెండు నెలలుగా.. అందాల కాజల్ స్వయంపాకంపై దృష్టి సారించింది. అందునా పాక శాస్త్రంలో తన ప్రావీణ్యం ఏపాటిదో చూపిస్తోంది. ప్రత్యేకించి బేకింగ్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంది. తన కిచెన్ లో రకరకాల ఆర్ట్ కి సంబంధించిన చిత్రాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.

తాజాగా కాజల్ ట్విట్టర్ లోకి కేక్ లు.. చాక్లెట్లు వంటి బేకింగ్ ఐటెమ్స్ ని పరిచయం చేసింది. ఇవన్నీ తుఫాన్ స్పీడ్ తో వండేస్తోందట. క్రీమ్ చీజ్ నురుగుతో కాల్చిన చాక్లెట్ కేకులు - క్యారెట్ కేకుల చిత్రాలను లేటెస్టుగా పోస్ట్ చేసింది. మొత్తానికి బేకరీ ఫుడ్ ఐటెమ్స్ లో కాజల్ కి నైపుణ్యం ఉందన్న సంగతి అభిమానులకు తెలిసిందిలా.

ఈ లాక్డౌన్ త్వరలోనే ముగుస్తుంది. అటుపై తిరిగి ఫిట్ నెస్ తరగతులకు ఎటెండవుతుందట. అలాగే షూటింగులు తిరిగి ప్రారంభిస్తున్నారు కాబట్టి భారతీయుడు 2 సెట్స్ కెళుతుందేమో చూడాలి. దీంతో పాటే పలు చిత్రాలు ఇప్పటికే పెండింగులో ఉన్నాయి. మంచు విష్ణు హాలీవుడ్ మూవీలోనూ కాజల్ నటిస్తోంది. దాని అప్ డేట్ తెలియాల్సి ఉందింకా.