కాజల్ ఆఫర్ల కోసం ఇంకా ఆరాటమే

Thu Jun 10 2021 23:00:01 GMT+0530 (IST)

Kajal is still looking for offers

కెరీర్ ఆరంభంలో హీరోయిన్స్ ఆఫర్ల కోసం ఆరాట పడటం చూస్తూ ఉంటాం. ఇండస్ట్రీలో నిలదొక్కుకునేందుకు సాధ్యం అయినన్ని ఎక్కువ సినిమాలు చేయాలని భావిస్తూ ఉంటారు. అందుకోసం ప్రాముఖ్యత ఉన్నా లేకున్నా కూడా సినిమాలకు కమిట్ అవుతూ ఉంటారు. కాని సీనియర్ హీరోయిన్స్ మాత్రం పాత్ర విషయంలో కాస్త ప్రాముఖ్యత ఉన్న సినిమాలను మాత్రమే చేయాలనుకుంటారు. కాని కాజల్ అగర్వాల్ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అయినా కూడా ఆఫర్ల కోసం ఆరాట పడుతూనే ఉన్నట్లుగా కనిపిస్తుంది.ఇటీవల ఈమె కు ఆఫర్లు తగ్గాయి. చేసిన వెబ్ సిరీస్ నిరాశ పర్చడంతో పాటు సినిమాలు కూడా ఫలితాన్ని ఇవ్వడం లేదు. దాంతో ఈమె మరిన్ని ఆఫర్ల కోసం వచ్చిన ప్రతి ఆఫర్ ను వదలకుండా పాత్ర ప్రాముఖ్యత లేకున్నా కూడా కమిట్ అవుతుంది. ఇటీవల ఈమె హిందీలో ఒక సినిమాకు కమిట్ అయ్యింది. ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా తక్కువ సమయం కనిపిస్తుంది. అయినా కూడా ఆమె వచ్చిన ఆఫర్ వదులుకోవడం ఇష్టం లేక ఓకే చెప్పిందట. మరీ ఇలాంటి పాత్రలను కాజల్ వంటి సీనియర్ హీరోయిన్ ఎలా కమిట్ అవుతుందని నెటిజన్స్ ముక్కున వేలేసుకుంటున్నారు.

తమిళంలో సక్సెస్ అయిన ఖైదీ సినిమా ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఖైదీ సినిమాలో హీరోయిన్ పాత్ర అసలు ఉండదు. కాని హిందీలో హీరోయిన్ పాత్రను క్రియేట్ చేస్తున్నారు. కమర్షియల్ ఎలిమెంట్స్ కోసం హీరో భార్య పాత్రను రాశారట. అజయ్ దేవగన్ కు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. చిన్న పాత్ర అయినా కూడా అజయ్ దేవగన్ తో సినిమా అవ్వడం వల్ల ఒప్పుకున్నట్లుగా కాజల్ చెబుతోంది. కాని కొందరు మాత్రం ఆఫర్ల కోసం కాజల్ అర్రులు చాచి వెయిట్ చేస్తుందంటూ విమర్శలు చేస్తున్నారు.