భర్త బిజినెస్ కి ప్రచారకర్తగా కాజల్

Sat Dec 05 2020 13:41:01 GMT+0530 (IST)

Kajal as a Brand Ambassador for her husband business

తన చిరకాల మిత్రుడు కం బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లుని చందమామ కాజల్ పెళ్లాడిన సంగతి తెలిసిందే.  హనీమూన్ ముగియగానే కాజల్ తదుపరి షెడ్యూల్స్ పై దృష్టి సారించారు. ప్రస్తుతం ఆచార్య చిత్రీకరణ కోసం కాజల్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు..  కాజల్ అగర్వాల్ తన భర్త కిచ్లుకి చెందిన ఇ-కామర్స్ సంస్థ `డిస్కర్న్ లివింగ్` కి ముఖచిత్రంగా మారనుందన్న సమాచారం అందింది.  ఈ సంస్థ త్వరలోనే కాజల్ తో బ్రాండ్ పబ్లిసిటీకి సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించబోతోందిట. ఆ మేరకు వివరాల్ని కాజల్ స్వయంగా వరుస ట్వీట్లలో వెల్లడించారు.డిస్కెర్న్ లివింగ్ అనేది ముంబైకి చెందిన ఇ-కామర్స్ సంస్థ. ఇది ఇంటీరియర్ డిజైన్ గృహాలంకరణలో ప్రత్యేకత కలిగి ఉన్న సంస్థ. కాజల్ ఇటీవల తమ సంస్థ కు చెందిన ప్రకటన కోసం షూటింగ్ లోనూ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడవుతాయని భావిస్తున్నారు.

ఇదిలావుండగా కాజల్ త్వరలో హైదరాబాద్ లో ఆచార్య సెట్స్ లో చేరనున్నాడు. కోరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి- కాజల్ నాయకానాయికలుగా నటిస్తుండగా రామ చరణ్ మరో కీలక పాత్రను పోషించనున్నారు.