Begin typing your search above and press return to search.

నాని సినిమాలో కాజల్ - నివేదా థామస్..?

By:  Tupaki Desk   |   18 Jun 2021 2:30 AM GMT
నాని సినిమాలో కాజల్ - నివేదా థామస్..?
X

నేచుర‌ల్ స్టార్ నాని హీరోగానే కాకుండా.. నిర్మాత‌గానూ వైవిధ్య‌మైన సినిమాలు నిర్మిస్తూ న్యూ టాలెంట్ ని ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇప్పటికే త‌న వాల్‌ పోస్ట‌ర్ సినిమా బ్యాన‌ర్ పై 'అ!' 'హిట్' వంటి కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు నిర్మించిన నాని.. నిర్మాతగా మరో రెండు సినిమాలను ప్రారంభించారు. అడవి శేష్ హీరోగా 'హిట్' చిత్రానికి సీక్వెల్ గా ''హిట్ 2' సినిమాని రూపొందిస్తున్నారు. ఇదే క్రమంలో తన సోదరి దీప్తి ఘంటా ను డైరెక్టర్‌ గా ప‌రిచ‌యం చేస్తూ ''మీట్ క్యూట్‌'' అనే చిత్రాన్ని స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన వార్తలు నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

అదేంటంటే.. మహిళా ప్రధానంగా సాగే ''మీట్ క్యూట్‌'' మల్టీస్టారర్ లో ఐదుగురు పాపులర్ హీరోయిన్స్ నటిస్తున్నారట. అందులో ఒకరు స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ అని అంటున్నారు. ఇప్పటికే నాని నిర్మించిన 'అ!' సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ క్రమంలో ఇప్పుడు మీట్ క్యూట్ లో కూడా చందమామ కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. అలానే ఇతర లీడ్ రోల్స్ కోసం నివేదా థామస్ - అదా శర్మ - రుహానీ శర్మలను తీసుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

'మీట్ క్యూట్' చిత్రంలో సీనియర్ నటుడు సత్యరాజ్ శక్తివంతమైన పాత్ర పోషించనున్నారు. ఈ చిత్రానికి విజయ్‌ బుల్గానిన్‌ సంగీతం సమకూరుస్తున్నారు. వసంత కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. గ్యారీ బిహెచ్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ముప్పై రోజుల్లో పూర్తి చేసేలా చిత్ర యూనిట్ ప్లాన్ చేశార‌ని స‌మాచారం.