చందమామవా? మంత్రగత్తెవా?

Sun May 19 2019 12:48:49 GMT+0530 (IST)

Kajal agarwal Latest Photo Shoot

చందమామ కాజల్ నటించిన `సీత` త్వరలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సీత టీజర్‌కి అద్భుత స్పందన వచ్చింది. ఈ సినిమాలో బిజినెస్ ఉమెన్ పాత్రలో కాజల్ రఫ్ & ఠఫ్ గా నటిస్తోంది. రామాయణం లైన్ ని ఎంచుకుని .. అభినవ సీతగా కాజల్ తో ప్రయోగమే చేస్తున్నాడు తేజ. `నేనే రాజు నేనే మంత్రి` తరహాలో స్పెషల్ గానే ట్రై చేస్తున్నాడని అర్థమవుతోంది. ఈ మూవీ కోసం తేజ అడిగినన్ని కాల్షీట్లు కేటాయించి సహకరించింది కాజల్.సీత చిత్రంతో పాటు కాజల్ ఉలగనాయగన్ కమల్ హాసన్ సరసన భారతీయుడు 2 చిత్రంలో నటిస్తోంది. నాయికా ప్రధాన కథల్ని వింటోందని సమాచారం. మరోవైపు ప్రస్తుత కాంపిటీషన్ పైనా కాజల్ దృష్టి సారించింది. అన్నిటినీ తట్టుకుని నిలబడాలంటే నేటి ట్రెండ్ లో సామాజిక మాధ్యమాల్లో స్పీడ్ గా ఉండాలని భావిస్తోంది. ఇన్ స్టాగ్రమ్.. ఫేస్ బుక్ మాధ్యమాల్లో కాజల్ రెగ్యులర్ గా ఫోటోషూట్లను అప్ లోడ్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో లేటెస్ట్ ఫోటో షూట్ ని అభిమానులకు షేర్ చేసింది. ఈ ఫోటోలకు `బ్లాక్ మ్యాజిక్` అన్న క్యాప్షన్ ని జోడించింది.

ఈ ఫోటోల్లో కాజల్ అందం పదింతలైంది. మునుపటితో పోలిస్తే మరింత హాట్ గా కనిపిస్తోంది. పూర్తిగా బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో మతిచెడే అందంతో కవ్విస్తోంది. `బ్లాక్ మ్యాజిక్` అన్న క్యాప్షన్ కి తగ్గట్టే బ్లాక్ లో మంత్రగత్తెలా కనిపిస్తోంది. కుర్రాళ్ల గుండెల్లో తిష్ఠ వేసుకుని కూచునే మాంత్రికురాలిలా మారిపోయిందనే అతిశయోక్త ఇకాదు. అందాల చందమామవా? మంత్రగత్తెవా? అంటూ బోయ్స్ కాజల్ ఫోటోలకు కామెంట్లు జోడించడం ఆసక్తికరం.