యువ హీరోయిన్ తల్లిగా కాజల్?

Wed Jan 25 2023 08:12:01 GMT+0530 (India Standard Time)

Kajal To Act as Mother in NBK108

లక్ష్మీ కల్యాణం సినిమాతో తెలుగు సినీ రంగంలో అడుగు పెట్టిన కాజల్ అగర్వాల్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారి పెద్ద పెద్ద హీరోల పక్కన నటించింది. తన అందం అభినయంతో.. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో గూడు కట్టుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ హిందీలో కూడా కాజల్ పలు సినిమాల్లో నటించి మెప్పించింది. అయితే 2020వ సంవత్సరం అక్టోబర్ 30వ తేదీన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని కాజల్ పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత నుంచి కాస్త సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు... 2022వ సంవత్సరం ఏప్రిల్ 19వ తేదీన పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఇన్నాళ్ల పాటు బాబుతో హాయిగా గడిపింది. ఇప్పుడిప్పుడే కాజల్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని చూస్తోందట.

ఆ విషయం చెప్పేందుకే సోషల్ మీడియాలో తన గ్లామరస్ ఫొటోలను షేర్ చేస్తూ.. కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది. అయితే తాజాగా అనిల్ రావుపూడి నటసింహం బాలకృష్ణ కాంబోలో వస్తున్న ఎన్బీకే 108 సినిమా కోసం కాజల్ ను చిత్ర బృందం కలిసినట్లు తెలుస్తోంది.

అయితే కాజల్ అగర్వాల్ ఈ సినిమాకు ఇంకా సంతకం చేయలేదట. కానీ ఆమె ఈ సినిమాలో నటించే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కాజల్ ఈ ప్రాజెక్టులో నటించేందుకు సంతకం చేస్తే బాగుంటుందని ఆమె అబిమానులు కోరుకుంటున్నారు.

ఎన్బీకే 108లో శ్రీలీల కీలక పాత్రలో నటించబోతోంది. ఆమెకు తల్లి పాత్రలోనే కాజల్ అగర్వాల్ ను తీసుకోవాలని చిత్రబృందం భావిస్తోందట. ఒకవేళ ఈ ముంబై ముద్దుగుమ్మ సినిమాకు సైన్ చేసిందంటే.. శ్రీలీల తల్లి పాత్రలో కనిపిస్తుంది.

అయితే బాలయ్య బాబు 108వ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా... షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహు గారపాటి హరీష్ పెద్ది కలిసి సినిమాను నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల గ్రాండ్ గా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తదుపరి షెడ్యూల్ ను ఫిబ్రవరి 5వ తేదీ నుంచి మొదలు పెట్టబోతున్నట్లు చెబుతున్నారు మూవీ మేకర్స్. తొలిసారిగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ నటిస్తుండడంతో బాలయ్య బాబు ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో సినిమా భారీ అంచనాలు మొదలయ్యాయి. నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.