#ఆచార్య.. కాజల్ కిచ్లు షెడ్యూల్ పై ఫుల్ క్లారిటీ

Sat Dec 05 2020 10:58:21 GMT+0530 (IST)

Kajal Kichlu Full Clarity on Acharya Schedule

మాల్దీవుల్లో హనీమూన్ ముగించి నేరుగా షూటింగుల్లో పాల్గొనేందుకు కాజల్ సిద్ధమయ్యారని ఇటీవల వార్తలు వచ్చాయి. కాజల్ అప్పటికే సంతకాలు చేసిన సినిమాల్ని త్వరగా పూర్తి చేసేందుకు షెడ్యూల్ వివరాల్ని తెలుసుకున్నారు.తాజా సమాచారం ప్రకారం..  కాజల్ వచ్చే నెల నుండి ఆచార్య చిత్రీకరణలో పాల్గొంటారని తెలిసింది. ఆచార్య టీమ్ జనవరిలో రాజస్థాన్ లో కొత్త షెడ్యూల్ ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్ లో చిరంజీవితో పాటు కాజల్ పాల్గొంటారు.

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి పై హైదరాబాద్ లో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు. మధ్యలో చిన్నపాటి గ్యాప్ ఇచ్చి డిసెంబర్ న జరగనున్న నిహారిక వివాహానికి చిరు అటెండవుతారు. తదుపరి తిరిగి హైదరాబాద్ లో చిన్నపాటి షెడ్యూల్ లో పాల్గొంటారు.  డిసెంబర్ చివరి నాటికి ఇది పూర్తవ్వగానే.. జనవరి మొదటి వారంలో కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. ఆ కొత్త షెడ్యూల్లో రామ్ చరణ్ జాయినవుతారు. ఇక ఇందులో చిరు సరసన కాజల్ నటిస్తుండగా.. చరణ్ సరసన రష్మికను నటింపజేయాలని కొరటాల భావిస్తున్నారట.

ఆచార్యతో పాటు కాజల్ అగర్వాల్ `భారతీయుడు 2`లో నటిస్తున్న సంగతి తెలిసిందే. `హే సినామిక` అనే వేరొక ప్రాజెక్టులోనూ కాజల్ నటిస్తోంది.  క్వీన్ అధికారిక రీమేక్ ‘పారిస్ పారిస్’ రిలీజ్ పైన క్లారిటీగా ప్రకటించాల్సి ఉంది.