చిరు - కమల్ మధ్య నలిగిపోతున్న స్టార్ హీరోయిన్...?

Tue Sep 29 2020 12:45:00 GMT+0530 (IST)

Kajal Gets Back To Back Chances With Kamal Hassan

సౌత్ ఇండస్ట్రీ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం అర డజను ఆఫర్స్ తో బిజీగా ఉంది. వాటిలో 'ఇండియన్ 2' 'ఆచార్య' వంటి క్రేజీ చిత్రాలు కూడా ఉన్నాయి. లోకనాయకుడు కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి అవాంతరాలు ఎదురవుతూ ఉన్నాయి. సెట్స్ లో జరిగిన ఘోర ప్రమాదం కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. దీంతో డేట్స్ ఖాళీగా ఉండటంతో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో వస్తున్న 'ఆచార్య' మూవీకి సైన్ చేసింది. అదే సమయంలో కరోనా రావడంలో 'ఆచార్య' షూటింగ్ కూడా వాయిదా పడింది. ఆరున్నర నెలల తర్వాత ఇప్పుడు ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు కూడా చిత్రీకరణ పునః ప్రారంభిస్తున్నారు.ఈ నేపథ్యంలో 'ఇండియన్ 2' 'ఆచార్య' రెండు సినిమాలు కూడా ఒకే సమయంలో సెట్స్ మీదకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. దీంతో కాజల్ ఏ సినిమాకి డేట్స్ ఇవ్వాలో తెలియక సతమతమవుతుందని ఫిలిం సర్కిల్స్ లో అనుకుంటున్నారు. కాకపోతే కాజల్ మెగాస్టార్ సినిమాకే ముందుగా డేట్స్ కేటాయించే అవకాశం ఉందట. ఎందుకంటే 'ఇండియన్ 2'లో కాజల్ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత లేదని అంటున్నారు. అయితే 'ఆచార్య' లో మాత్రం కాజల్ మెయిన్ లీడ్ హీరోయిన్ గా చేస్తోంది. అందువల్ల ఈ బ్యూటీ 'ఆచార్య' టీమ్ కే ముందుగా డేట్స్ కేటాయించే ఆలోచనలో ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.