Begin typing your search above and press return to search.

కిచ్లుతో బంధం అలా ముడిప‌డింది!

By:  Tupaki Desk   |   26 Nov 2020 5:30 AM GMT
కిచ్లుతో బంధం అలా ముడిప‌డింది!
X
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన ప్రియుడు గౌతమ్ కిచ్లుని అక్టోబర్ 30న ముంబైలో పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. ఈ జంట గత పది రోజులుగా మాల్దీవుల్లో జాయ్ ఫుల్ గా హనీమూన్ ని ఆస్వాధించారు. సుందరమైన ద్వీపంలో సెలవుల్ని సెల‌బ్రేట్ చేసుకున్నారు.

ఈ సంద‌ర్భంగా కాజల్ మీడియాల‌తో ముచ్చ‌టిస్తున్నారు. గౌతమ్ తో తన సంబంధం కొన్నేళ్లుగా ఎలా వికసించిందనే దాని గురించి తాజా ఇంటర్వ్యూలో కాజల్ వెల్ల‌డించారు. 8 సంవత్సరాల క్రితం ఒక సాధారణ స్నేహితుడి వివాహంలో వారిద్దరూ మొదట కలుసుకున్నామ‌ని ఆమె వెల్లడించింది. ఆరంభం పెద్దగా మాట్లాడుకోనప్పటికీ వారు అప్పుడప్పుడు సన్నిహితంగా మెలిగేవార‌ట‌.

కొన్నేళ్ల క్రితమే ప్రేమకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆ తర్వాత ఇరు కుటుంబాలు కలిశాయ‌ని కాజల్ వెల్లడించారు. చివరకు యువ జంట లాక్ డౌన్ సమయంలో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. పెళ్లితో అనుబంధం ముడిప‌‌డింద‌ని కాజ‌ల్ వెల్ల‌డించారు.