గ్లామర్ డోర్స్ తెరిచేసిన చందమామ..!

Sun Jul 12 2020 06:00:07 GMT+0530 (IST)

Chandamama opens Glamor Doors ..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ షో చేయడానికి వెనుకాడరు. సినిమా అనే రంగుల ప్రపంచంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే గ్లామర్ షో కూడా అవసరమే భావిస్తుంటారు. కొంతమంది మాత్రం గ్లామర్ షో చేసినా తమ పరిధిలోనే అందాల ఆరబోతకు రెడీ అవుతారు. సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కూడా ఆ కోవకే చెందుతుంది. కాజల్ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత రొమాంటిక్ సన్నివేశాల్లో నటిస్తూ అవసరమైనప్పుడు గ్లామర్ షో చేసినప్పటికీ ఇప్పటివరకు బికినీ ధరించి నటించలేదు. కాజల్ అగర్వాల్ తో పాటు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్స్ అందరూ సింగిల్ పీస్ లేదా టూ పీస్ బికినీ షోలతో వారి క్రేజ్ ఇంకా పెంచుకున్నారు. కానీ కాజల్ మాత్రం ఈ షోకి దూరంగానే ఉంటూ వచ్చింది. అయినప్పటికీ స్టార్ హీరోస్ పక్కన వరుస ఆఫర్స్ దక్కించుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కి వెళ్లిపోయింది. అయితే ఇప్పుడు అమ్మడు తన అప్ కమింగ్ మూవీ కోసం బికినీ ధరించడానికి రెడీ అయిందట కాజల్.కాగా ప్రస్తుతం కాజల్ అగర్వాల్ కి మంచి టైమ్ నడుస్తోంది. అందుకే క్రేజీ ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి. ప్రస్తుతం అమ్మడి చేతిలో అర డజనుకి పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వాటిలో లోకనాయకుడు కమల్ హాసన్ - డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2'. 'భారతీయుడు' సినిమాకి సీక్వెల్ గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ లీడ్ రోల్ చేస్తోంది. ఈ సినిమాలో కాజల్ కాస్త ఓవర్ గ్లామర్ గానే కనిపించబోతుందని సమాచారం. దీని కోసం ఈ బ్యూటీ కెరీర్లోనే ఫస్ట్ టైం బికినీ ట్రీట్ ఇచ్చి తన ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇవ్వడానికి రెడీ అవుతోందట. 'ఇండియన్ 2' షూటింగ్ తిరిగి స్టార్ట్ అవ్వగానే డైరెక్టర్ శంకర్ ఈ సీన్స్ కాజల్ పై షూట్ చేయబోతున్నారని సమాచారం. మరి 12 ఏళ్ల సినీ కెరీర్లో ఎప్పుడూ చేయని సాహసం చేస్తున్న చందమామ కాజల్ అగర్వాల్ కి ఈ సినిమా ఎలాంటి ఇమేజ్ తీసుకొస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా కాజల్ ప్రస్తుతం తెలుగులో మెగాస్టార్ చిరంజీవి 'ఆచార్య'.. మంచు విష్ణు 'మోసగాళ్లు' చిత్రాల్లో నటిస్తోంది. ఇక తమిళంలో 'హే సినామికా'లో.. హిందీలో 'ముంబయి సాగా' చిత్రాల్లో కూడా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.