Begin typing your search above and press return to search.

క‌త్తిలాంటి క‌త్రిన ప‌ద్మావ‌త్ దీపిక స్ఫూర్తితో

By:  Tupaki Desk   |   2 Feb 2023 11:00 PM GMT
క‌త్తిలాంటి క‌త్రిన ప‌ద్మావ‌త్ దీపిక స్ఫూర్తితో
X
త‌న‌దైన అందం చందం న‌ట‌ప్ర‌తిభ‌ ఒదిగి ఉండే స్వ‌భావంతో దాదాపు రెండు ద‌శాబ్ధాలుగా తెలుగు సినీప‌రిశ్ర‌మ‌ను ఏలిన క‌థానాయిక కాజ‌ల్ అగ‌ర్వాల్. ఇటీవ‌ల త‌న స్నేహితుడు కం బిజినెస్ మేన్ గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన సంగ‌తి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత జూనియ‌ర్ చంద‌మామ‌కు జ‌న్మ‌నిచ్చిన కాజ‌ల్ నట‌న‌లో కొన‌సాగుతుందా లేదా? అన్న సందేహం అభిమానుల‌ను వెంటాడింది. కానీ కాజ‌ల్ అగ‌ర్వాల్ ప్లాన్ చూస్తుంటే పూరి చెప్పిన డైలాగ్ లా 16వ మైల్ (ఎయిమ్ ఫ‌ర్ సిక్స్ టీన్త్ మైల్) ని తాకేట్టే క‌నిపిస్తోంది.

చిరంజీవితో ఆచార్య .. నాగార్జున‌తో ఘోస్ట్ సినిమాల్లో పెళ్లికి ముందు అవ‌కాశాలు అందుకుంది. కానీ పెళ్లి ఎపిసోడ్ తో ఆ రెండు సినిమాల‌కు చెక్ ప‌డిపోయింది. ఆచార్య‌లో న‌టించినా త‌న పాత్ర ప‌రిధి కుంచించుకుపోయింది. మ‌రోవైపు ఘోస్ట్ సినిమా నుంచి త‌న‌కు తానుగానే స్వ‌చ్ఛందంగా వైదొల‌గింది. కానీ ఇప్పుడు తిరిగి తెలుగులో అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింద‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి.

తాజా స‌మాచారం మేర‌కు.. కాజల్ కొన్ని పెద్ద ప్రాజెక్టులను ప్రకటించేందుకు చేరువ‌లో ఉంద‌ని స‌మాచారం. వ‌రుస హిట్ల‌తో దూకుడుమీదున్న నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ స‌ర‌స‌న న‌టించేందుకు కాజ‌ల్ అగ‌ర్వాల్ సిద్ధ‌మ‌వుతోంద‌ని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రం కోసం ప్ర‌ముఖ నిర్మాత అనీల్ రావిపూడి చంద‌మామ‌కు భారీ పారితోషికం ముట్ట‌జెబుతున్నార‌ని గుస‌గుస‌. త‌దుప‌రి నాగార్జున‌- చిరంజీవి - వెంక‌టేష్‌- ర‌వితేజ లాంటి అగ్ర హీరోల స‌ర‌స‌న న‌టించేందుకు కాజ‌ల్ కు ఎలాంటి అభ్యంత‌రం లేదు. అవ‌కాశాల కోసం వేచి చూస్తోంద‌నేది తాజా గుస‌గుస‌.

ఓవైపు తెలుగు అగ్ర హీరోల‌కు క‌థానాయిక‌ల కొర‌త ఎలానూ వేధిస్తోంది. కాబ‌ట్టి కాజ‌ల్ కంబ్యాక్ కొంత ఊర‌ట‌నిచ్చేదే. అయితే బిడ్డ త‌ల్లి అయ్యాక కాజ‌ల్ ని ఎవ‌రు ఎంపిక చేస్తారు? అనుకుంటే పొర‌పాటేన‌ని అర్థ‌మ‌వుతోంది. నిజానికి బాలీవుడ్ లో క‌రీనాక‌పూర్ ఖాన్... క‌త్రిన కైఫ్‌... దీపిక ప‌దుకొనే లాంటి స్టార్లు ఇప్ప‌టికీ అగ్ర క‌థానాయిక హోదాను కొన‌సాగిస్తున్నారు. గ్లామ‌ర‌స్ యాంగిల్ లో న‌టించేందుకు ఏమాత్రం వెన‌కాడ‌డం లేదు. ఇక‌పై కాజ‌ల్ కూడా ప్ర‌ముఖ హిందీ హీరోయిన్ల‌ బాట‌ను అనుస‌రించేందుకు సిద్ధంగా ఉంద‌ని తెలుస్తోంది.

అయినా నేను మెల్లగా ఎలాగోలా బతికెయ్యటానికి రాలేదు. ఇండ‌స్ట్రీని ఉ* పోయించటానికి వచ్చాను! అన్న చందంగా రెండో ఇన్నింగ్స్ లో కాజ‌ల్ దూసుకొస్తుందేమో చూడాలి. ఇంకా అవ‌కాశం ఉంటే బిజినెస్ మేన్ 2లో మ‌హేష్ స‌ర‌స‌న‌.. మ‌గ‌ధీర సీక్వెల్లో చ‌ర‌ణ్ స‌ర‌స‌న డార్లింగ్ సీక్వెల్లో ప్ర‌భాస్ తో..బృందావ‌నం పార్ట్ 2లో ఎన్టీఆర్ స‌ర‌స‌న న‌టించేసినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదేమో అని గుస‌గుస వినిపిస్తోంది! కానీ నేటిత‌రం క‌థానాయిక‌ల నుంచి ఠ‌ఫ్ కాంపిటీష‌న్ ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.