ఫోటో స్టోరి: నల్ల కోకలో అమ్మడు కుమ్ముడేగా

Tue Sep 29 2020 23:13:09 GMT+0530 (IST)

Photo Story: beautiful in black saree

మెగాస్టార్ చిరంజీవి సరసన వెంట వెంటనే ఆఫర్లు అందుకునే అవకాశం సద్భాగ్యం ఎవరికి కలిగింది? అంటే .. ఇంకెవరు.. చందమామ కాజల్ కి మాత్రమే అలాంటి ఆఫర్. ఓవైపు చరణ్ సరసన నటించినా చిరు ఏమాత్రం భేషజానికి పోకుండా చందమామకు అవకాశం ఇవ్వడం ఆసక్తికరం. ఆచార్యలో చందమామ రోల్ ఎలా ఉంటుందన్నది కొరటాల శివ ఇంకా చెప్పనే లేదు. ఈ మూవీ త్వరలోనే పునః ప్రారంభం కాబోతోంది. చిత్రీకరణ ఎప్పుడు స్టార్టవుతుందా అని కాజల్ గత కొన్ని నెలలుగా ఎదురుచూస్తోంది.ఈ క్వారంటైన్ సమయంలో సోషల్ మీడియా వేదికగా తన ఫ్యాన్స్ కి అందుబాటులో వుంటోంది. వరుస ఫొటోలతో ఆకట్టుకుంటోంది. ఎప్పటి కప్పుడు హీట్ పెంచే ఫొటో షూట్ లతో అభిమానులకు వెరైటీ ట్రీట్ అందిస్తూ హీటెక్కిస్తోంది. ఈ మధ్య సోషల్ మీడియా నుంచి కొంత విరామం తీసుకున్న కాజల్ మళ్లీ సందడి చేయడం మొదలుపెట్టింది.

చాలా కాలంగా పెళ్లి అంటూ ప్రచారమైంది. ఎట్టకేలకు తన పెళ్లి ప్రణాళికలను వచ్చే ఏడాదికి వాయిదా వేశారన్న పుకార్ల నేపథ్యంలో కాజల్ వైఖరి మారినట్టే కనిపిస్తోంది. సోషల్ మీడియా హాట్ ఫోటోషూట్లతో హీటెక్కించింది. బ్లాక్ డ్రెస్ లో కాజల్ స్పెషల్ షో అంతర్జాలాన్ని అల్లాడిస్తోంది. ఓ పార్టీ లో తళుక్కున మెరిసిన కాజల్ తన బ్లాక్ శారీ లుక్ తో వేడిని పెంచుతోంది. ట్రెడిషనల్ గా కనిపించినా నల్ల కోకలో సెగలు రేపడం అమ్మడికే చెల్లింది మరి. కాజల్ `ఆచార్య`తో పాటు `ఇండియన్ 2` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెండు చిత్రాలు వచ్చే నెల నుంచి సెట్స్ పైకి రానున్నాయట.