ఫోటో స్టోరి: చందమామ చీరకట్టు ఛమక్కులే

Tue May 26 2020 09:45:06 GMT+0530 (IST)

Kajal Agarwal Stunning Pose In Saree

చందమామ అందాన్ని ఏమని వర్ణించాలి. మచ్చలేని చందమామకు మరు రూపంలా ఉందీ భామ. పాక్షికంగా అందాల్ని ఎరవేస్తూ చీరను ఇంత అందంగా ఒంటికి అల్లేయవచ్చా? అన్నంతగా ఎంత అందంగా మేకప్ అయ్యింది?  సొగసరి అందాన్ని పూల తీగ అల్లుకున్న చందంగా ఆ చీర ఎంత ఒద్దికగా కుదిరిందో కదూ!పింకు బ్లౌజు.. కాంబినేషన్ వంగపువ్వు రంగు డిజైనర్ అంచు.. ఆ బాటమ్ మొత్తం కవర్ చేస్తూ ఉన్న చక్కని ప్రకృతి కళాకృతి.. ఆహా అనిపించడం లేదూ? ఎర్ర ఎర్రని పూలు.. షైనీ బ్లూ ఆకులు రెమ్మలు ఆహా అనిపిస్తున్నాయ్. స్టన్నింగ్ డిజైనర్ లుక్ ఇది!.. కాజల్ కోసమే ఈ డిజైన్ ని రూపొందించారా? అన్నంతగా ఇది సెట్టయ్యింది. ఎన్నిరకాల చీరల్ని డిజైన్ చేసినా కానీ.. ఇంత అద్భుతమైన డిజైనర్ చీరను రూపొందించడం అరుదుగానే సాధ్యమవుతుంది. ప్రస్తుతం ఈ ఫోటో యువతరంలో వైరల్ గా మారింది.

కాజల్ కెరీర్ సంగతిచూస్తే.. లాక్ డౌన్ కారణంగా చందమామ కాజల్ నటిస్తున్న తాజా చిత్రం భారతీయుడు 2 వాయిదా పడింది. ఎన్నో ఇబ్బందుల్లో ప్రారంభమై .. ఊహించని లాక్ డౌన్లతో అల్లాడింది. ప్రస్తుతం మహమ్మారీ నేపథ్యంలో ఈ సినిమా పూర్తవుతుందా? అంటూ సందేహాలు వ్యక్తమయ్యాయి. మరోవైపు కాజల్ నటించిన పారిస్ పారిస్ (క్వీన్ రీమేక్) రిలీజ్ కి నోచుకోకుండా పెండింగులో ఉంది. వీటన్నిటి నడుమా రిలీఫ్ కోసం మంచు విష్ణుతో ఓ హాలీవుడ్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా సన్నివేశం ఏమిటో తెలియాల్సి ఉందింకా.