మెహెందీలో అదే నవ్వుతో బౌన్సర్ విసిరిన కాజల్

Thu Oct 29 2020 09:45:23 GMT+0530 (IST)

Kajal Agarwal Shows Off Her Mehendi

అందాల చందమామ కాజల్ పెళ్లి బాజా కి ఇంకో 24 గంటల సమయమే మిగిలి ఉంది. ఈ గురువారం (అక్టోబర్ 30 న) ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడేస్తున్న సంగతి తెలిసినదే. ఇప్పటికే పెళ్లి సంబరాలు ఫుల్ స్వింగులో సాగుతున్నాయి. తాజాగా కాజల్ సోదరి నిషా అగర్వాల్ వివాహానికి పూర్వపు వేడుకలు.. అలాగే హల్ది మెహెంది వేడుకలకు సంబంధించిన ఫోటోల్ని షేర్ చేసింది. పెళ్లికి ముందు కాజల్ కుటుంబం వారి ఇంటి వద్ద ఆతిథ్యం ఏర్పాటు చేసింది. ఇది బిగ్ డే.COVID-19 మహమ్మారి మార్గదర్శకాల కారణంగా కాజల్ - గౌతమ్ జంట పరిమిత అతిథులతో సింపుల్ గా పెళ్లి వేడుకను కానిచ్చేస్తోంది. ఇంత సింపుల్ గా సరిపెట్టేస్తున్నందుకు  కాజల్ కుటుంబం కాస్త నిరుత్సాహంగానే ఉన్నారట. ఆంక్షలు ఉన్నప్పటికీ షాదీ కా మహౌల్ ను రూపొందించడానికి మా వంతు ప్రయత్నం చేస్తున్నాము. మేము సాంప్రదాయ హల్ది  మెహెందీ వేడుకలను ఇంట్లో నిర్వహించాము. రెండు వేడుకలు ఒకే రోజున జరిగాయి అని నిషా అగర్వాల్ తెలిపారు. పెళ్లి రోజున పాటల కార్యక్రమం .. డ్యాన్సులాడటం... ఉంటుందని నిషా తెలిపింది. సింపుల్ వెడ్డింగ్ అయినప్పటికీ పెళ్లి అంటేనే ప్రత్యేకమైనది..పెళ్లి రోజునే చక్కని హాయి గొలిపే సంగీతాన్ని ప్లాన్ చేసాం అని నిషా వెల్లడించింది.

కాజల్ సోదరి తన బావ గౌతమ్ ని తెగ ఆటపట్టించేస్తోందట. సోదరి ప్రేమ కథ విషయానికొస్తే  ఎంతో సూపర్భ్ గా ఉంటుందని నిషా అగర్వాల్ వెల్లడించింది ఓ ఇంటర్వ్యూలో. అక్క కాజల్ తో పాటు  నిషా అగర్వాల్ ఇన్ స్టాగ్రామ్ లో ఫోటోల్ని షేర్ చేసింది. ఇందులో కాజల్ తన మెహెందీ దృశ్యాన్ని ఇదిగో ఇలా ప్రదర్శించింది. చందమామ ఏం చేసినా చక్కందమే. ఆ నవ్వులోనే బోలెడంత పండగ ఉంటుంది. ఇక మెహెందీ తో మరింత అందం ఇనుమడించింది.