కాజల్ అగర్వాల్ ప్రెగ్నెన్సీ పాఠాలు

Thu Jan 20 2022 17:00:06 GMT+0530 (IST)

Kajal Agarwal Pregnancy Lessons

అందాలా చందమామ కాజల్ అగర్వాల్ గత రెండేళ్ల క్రితం తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుంది. ఏడేళ్లుగా డేటింగ్ లో వున్న ఈ జంట ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో సంప్రదాయ బద్ధంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు. 2020 అక్టోబర్ 30న కాజల్ గౌతమ్ కిచ్లూ ల వివాహం జరిగింది. ఆ తరువాత ఈ జంట మాల్దీవ్స్ లో హనీ మూన్ ని ప్రత్యేకంగా ప్లాన్ చేసుకుని అందరిని ఆశ్చర్య పరిచారు. ఆ వెంటనే కాజల్ ప్రెగ్నెంట్ అంటూ వార్తలు హల్ చల్ చేశాయి.ఆ వార్తల్ని నిజం చేస్తూ తన భార్య కాజల్ ప్రెగ్నెంట్ అని గౌతమ్ కిచ్లూ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి షాకిచ్చాడు. ఈ సందర్భంగా బేబీ బంప్ ఫొటోలని షేర్ చేసింది కాజల్ అగర్వాల్. ఆ తరువాత ప్రెగా న్యూస్ యాడ్ లో కనిపించి సర్ ప్రైజ్ చేసింది. ప్రస్తుతం కాజల్ ప్రెగ్నెంట్ కావడంతో ఆమెకు ప్రత్యేకంగా ఓ డాక్టర్ ని కేటాయించి గౌతమ్ కిచ్లూ ప్రెగ్నెన్సీ పాఠాలు చెప్పిస్తుండటం విశేషం.

ఇదే విషయాన్ని తెలియజేస్తూ కాజల్ అగర్వాల్ తన ఇన్ స్టా స్టోరీస్ లో తన `ప్రెనాటల్ క్లాసెస్` కి సంబంధించిన సెషన్ ఫొటొస్ ని షేర్ చేసింది. అలాగే చెల్లెలు నిషా అగర్వాల్ తనయుడితో గడిపిన మెమోరీస్ ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఆ ఫొటోలని షేర్ చేస్తూ మదర్ హుడ్ ఫీల్‌ని పొందుతోంది. ప్రెనాటల్ క్లాసెస్ లో కాజల్ స్లీవ్ లెస్ టాప్ ధరించి ట్రాక్ సూట్ లో ఫ్లోర్ పై కూర్చుని కనిపించింది.

డెలివరీ సమయంలో తాను తనకు పుట్టబోయే బిడ్డ చాలా హెల్దీగా వుండాలని కాజల్ ప్రస్తుతం ప్రెనాటల్ క్లాసెస్ లో పాల్గొంటోందట. తను గర్భం దాల్చడానికి ముందు తన సోదరి తనయుడు ఇషాన్ ని తన తనయుడిలానే ఫీలైంది కాజల్. అప్పుడే తాను మాతృత్వపు మాధుర్యాన్ని ఆస్వాదిస్తున్నానని వెల్లడించింది కూడా. అంతే కాకుండా తన జీవితంలోకి ఓ బిడ్డ అడుగుపెడితే నాలోని భావోద్వేగాలని మరింత పెంచుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నానని తెలిపింది.

కాజల్ అగర్వాల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న `ఆచార్య` చేస్తోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయిపోయింది. ఇక కమల్ హాసన్ తో చేస్తున్న `ఇండియన్ 2` పూర్తి కావాల్సి వుంది. ప్రెగ్నేన్సీ కారణంగా కాజల్ ... తెలుగులో నాగార్జున నటిస్తున్న `ఘోస్ట్` మూవీని వదులుకున్న విషయం తెలిసిందే.