కాజల్ అగర్వాల్ మెరుపులు మిరుమిట్లు తగ్గేదేలే!

Fri Sep 24 2021 07:00:01 GMT+0530 (IST)

Kajal Agarwal Latest Photo

పదిహేనేళ్లుగా సౌత్ ఇండియన్ ఇండస్ట్రీని ఏలేస్తోంది అందాల చందమామ కాజల్ అగర్వాల్. `లక్ష్మీ కల్యాణం`తో ఎంట్రీ ఇచ్చిన కాజల్ తనదైన అభినయంతో మంచి నటిగా.. స్టార్ డమ్ ని గుర్తింపుని సొంతం చేసుకుంది. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తున్న కాజల్ తన చిరకాల మిత్రుడు గౌతమ్ కిచ్లూని వివాహం చేసుకుని సెటిలైన వియం తెలిసిందే. మాల్దీవ్స్ లో హనీమూన్ కూడా పూర్తి చేసుకున్న కాజల్ త్వరలో తల్లి కాబోతోందంటూ ఇటీవల వరుస కథనాలు వినిపిస్తున్నాయి.అయితే తాజాగా కాజల్ అగర్వాల్ షేర్ చేసి ఫొటోలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బ్లాక్ బ్రా.. క్వీన్ క్రాప్ టాప్.. ఫ్లవర్ హ్యాండ్ వర్క్ బ్లూ కలర్ పాంట్ ధరించి జిగేల్ మని మెరుపులు మెరిపిస్తోంది. తాజా డ్రెస్ లో కాజల్ మరింత హాట్ గా కనిపిస్తూ గ్లామర్ గేమ్ కు తెరలేపింది. ఇందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫొటోలు చూసి ఫ్యాన్స్ కాజల్ అందానికి ఫిదా అయిపోతున్నారు. పెళ్లి తరువాత కాజల్ అందం రెట్టింపైందని కామెంట్‌లు చేస్తున్నారు.

మూడు వర్ణాల డ్రెస్ లో కాజల్ కాంతులీనుతున్న స్టిల్స్ ఆమె అందం మరింతగా రెట్టింపయిందని తెలిజేస్తోంది. పెళ్లి తరువాత ఎవరైనా గ్లామర్ గా కనిపించడానికి జంకుతుంటారు కానీ అందుకు పూర్తి భిన్నంగా గ్లామర్ గేమ్ కి తెరలేపడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కాజల్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య`.. కమల్ హాసన్ తో `ఇండియన్ 2`.. ఉమ.. ఘోస్ట్ వంటి చిత్రాల్లో నటిస్తోంది.