ఐస్ ఫ్రూట్ తో ఊరించడం తగునా కాజల్ కిచ్లు?

Thu Jun 17 2021 19:00:01 GMT+0530 (IST)

Kajal Agarwal Latest Photo

అందాల చందమామ కాజల్ ప్రస్తుతం ఏం చేస్తున్నారు?  ముంబైలో లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చాక సాటి కథానాయికలంతా షూటింగులకు వెళుతుంటే కాజల్ అక్కడే ఇంకా ఏం చేస్తోంది? అంటే.. ఇదిగో ఇలా ముంబైలో షికార్ వెళ్లింది. అక్కడ కార్ లో కూచుని ఐస్ ఫ్రూట్ తింటోంది.ఇంతకీ ఒక చేతిలో కాజల్ తినే ఐస్ ఫ్రూట్.. మరి రెండో చేతిలో ఎవరిది? అంటే.. తన పక్కనే డ్రైవింగ్ సీట్లో ఉన్న కిచ్లుదే అయ్యుంటుంది. సగం సగం తిన్న ఐస్ ఫ్రూట్ ని అలా ప్రదర్శిస్తోంది కాజూ. బావుంది.. అసలే రెయినీ సీజన్. వర్షంలో ఐస్ ఫ్రూట్ తింటే ఉండే మజానే వేరు కదా! అందుకే అలా చిటపట చినుకుల్లో రొమాంటిక్ గా ఇలా ప్లాన్ చేసిందా? ఏదేమైనా ఐస్ ఫ్రూట్ పార్టీ వెనక కథేమిటో కాజల్ కిచ్లునే వెల్లడించాలి.

ఇంతకుముందే కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో ఉన్న ఫోటోలను పంచుకోగా అవి వైరల్ గా మారాయి. మహమ్మారి సమయంలో కాజల్ ఆమె భర్త కలిసి వ్యాయామం చేస్తున్నారు. గత ఏడాది అక్టోబర్ 30 న ముంబైలో జరిగిన ఒక ప్రైవేట్ కార్యక్రమంలో కాజల్ అగర్వాల్.. బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన సంగతి తెలిసిందే. కాజల్ ప్రస్తుతం ఆచార్యలో నటిస్తోంది. ఇండియన్ 2 .. హే సినామికా తదుపరి షెడ్యూల్స్ లో జాయిన్ కావాల్సి ఉంటుంది. భారతీయుడు 2 దర్శకనిర్మాతలు ప్రస్తుతం వివాదాల్లో ఉన్న సంగతి తెలిసిందే.