'సపోర్ట్ సిస్టమ్' అంటూ స్టార్ హీరోయిన్ సెల్ఫీ పోస్ట్..!

Tue May 04 2021 08:00:01 GMT+0530 (IST)

Kajal Agarwal Latest Photo

ప్రస్తుతం కరోనా టైం కాబట్టి దేశంలో సినిమారంగం మొత్తం మూతపడే స్థితికి చేరుకుంది. రోజురోజుకి లక్షల్లో కేసులు.. వేలసంఖ్యలో కోవిడ్ మరణాలు చూసి సామాన్యుల దగ్గరనుండి సెలబ్రిటీల వరకు అందరూ చింతిస్తూనే ఉన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితి దేశంలో నెలకొన్నందుకు జనాలతో పాటు సెలబ్రిటీలు కూడా వారికి తోచిన విధంగా సహాయం అందిస్తున్నారు. కొందరు ఇంటి వద్ద ఉంటూ సోషల్ మీడియా వేదికగా అవగాహనా కల్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ ఆక్టివిటీస్ లో ఎక్కువగా పాల్గొనే స్టార్ హీరోయిన్ చందమామ కాజల్.. ప్రస్తుతం సోషల్ మీడియాలో తమ అభిమానులకు కోవిడ్ జాగ్రత్తలు చెబుతూనే ఉంది.అలాగే ఇంట్లో నుండి బయటికి వెళ్ళకూడదు అని తమ ఫోటోలు పోస్ట్ చేసి సూచిస్తుంది. తాజాగా కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలిసి ఫోటో పోస్ట్ చేసింది. ఎందుకో మరి ఈ మధ్యన కాజల్ భర్తతో సెల్ఫీలు దిగి పోస్టులు పెడుతూనే ఉంది. అమ్మడు లేటెస్ట్ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భర్త గౌతమ్ ను ఆలింగనం చేసుకున్న పిక్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో గౌతమ్ సెల్ఫీ తీయగా వెనక నుండి కాజల్ భర్తను హగ్ చేసుకొని కెమెరా వైపు లుక్కిచ్చింది. అలాగే 'సపోర్ట్ సిస్టమ్' అంటూ ట్యాగ్ లైన్ జోడించింది కాజల్. ప్రస్తుతం అమ్మడి ఫోటోస్ చూస్తూ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.

ప్రస్తుతం కాజల్ చేతిలో మెగాస్టార్ చిరంజీవి సరసన నటిస్తున్న ఆచార్య సినిమా ఉంది. ఈ సినిమాతో పాటు  దుల్కర్ సల్మాన్ తో నటించిన 'హే సినామిక' హారర్ థ్రిల్లర్ ఘోస్టీ సినిమాలతో పాటుగా కమల్ హాసన్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారతీయుడు-2 కూడా ఆమె చేతిలో ఉంది. ప్రస్తుతం నటిగా బిజీ అయినప్పటికీ కరోనా మహమ్మారి కుదుపు వలన కాజల్ ఇంటిపట్టునే ఉంటూ మెల్లగా ఆధ్యాత్మికత వైపు మొగ్గుచూపుతున్నట్లు చెప్పుకొచ్చింది. చూడాలి మరి కాజల్ అగర్వాల్.. త్వరలో ఏవైనా ఆధ్యాత్మిక పాఠాలు చెబుతుందేమో..!