Begin typing your search above and press return to search.

చీర‌లో చంద‌మామ కిల్లింగ్ లుక్ వైర‌ల్

By:  Tupaki Desk   |   7 March 2021 3:30 AM GMT
చీర‌లో చంద‌మామ కిల్లింగ్ లుక్ వైర‌ల్
X
సాంప్ర‌దాయ దుస్తులు అయినా మోడ్రన్ ఔట్ ఫిట్స్ అయినా ప‌ర్ఫెక్ట్ గా ఒదిగిపోయే అందం కాజ‌ల్ సొంతం. ఎలాంటి డిజైన‌ర్ లుక్ కి అయినా చంద‌మామ స‌రిపోతుంది. ఇటీవ‌లే బిజినెస్ మ్యాన్ కం ఫ్రెండు గౌత‌మ్ కిచ్లుని పెళ్లాడిన కాజ‌ల్ మ్యారేజ్ త‌ర్వాతా న‌టిగా బిజీగా ఉన్నారు.

మెగాస్టార్ చిరంజీవి స‌ర‌స‌న ఆచార్య సినిమాలో కాజ‌ల్ న‌టిస్తున్నారు. ఇక ఈ మూవీ షూటింగ్ తో ఓవైపు బిజీగా ఉన్నా సోష‌ల్ మీడియాల్లోనూ ఆట‌విడుపుగా అడ‌పాద‌డ‌పా ఫోటోషూట్ల‌ను రివీల్ చేస్తున్నారు. తీరిక స‌మ‌యాల్లో ఎవ్వ‌ర్ లేటెస్ట్ ఫోటోషూట్ల‌తో చెల‌రేగుతున్నా.. షూట్ బిజీలో రేర్ ఫోటోగ్రాఫ్ లను మాత్రం అభిమానుల కోసం షేర్ చేస్తున్నారు.

తాజాగా చీర‌లో ఎంతో ముగ్ధ‌మ‌నోహ‌రంగా ఉన్న ఫోటోని షేర్ చేశారు. డార్క్ షేడెడ్ ఫ్లోర‌ల్ శారీలో చంద‌మామ అందం ప‌దింత‌లైంది. పైగా ఆ న‌డుమందాన్ని ఎలిఏట్ చేస్తూ నాభి దిగువ‌న కుచ్చిళ్ల దోపిన‌ వైనం యూత్ కి ఇట్టే క‌నెక్ట‌యిపోతోంది. దీంతో ఈ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. కాజ‌ల్ ఇదే మాదిరిగా ఆచార్య‌లోనూ దూకుడు చూపిస్తుందా? అంటూ మెగాభిమానులు ప‌రేషాన్ అవుతున్నారు. ఆచార్య మేలో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ పూర్తి చేసి రిలీజ్ చేయాల‌న్న ప్లాన్ తో చిరు-కాజ‌ల్ - కొర‌టాల బృందం హార్డ్ వ‌ర్క్ చేస్తున్నారు.