Begin typing your search above and press return to search.

ఔను ముసలమ్మ పాత్రే చేస్తున్నాను : కాజల్‌

By:  Tupaki Desk   |   17 Jan 2020 8:45 AM GMT
ఔను ముసలమ్మ పాత్రే చేస్తున్నాను : కాజల్‌
X
టాలీవుడ్‌ లో పుష్కర కాలంగా టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగిన ముద్దుగుమ్మ కాజల్‌ ఈ మద్య కాలంలో కాస్త జోరు తగ్గిందని చెప్పుకోవచ్చు. ఈ అమ్మడు ప్రస్తుతం తెలుగులో చెప్పుకోదగ్గ చిత్రాల్లో చేయడం లేదు. కాని తమిళంలో మాత్రం ఇండియన్‌ 2 చిత్రంలో నటిస్తోంది. శంకర్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కమల్‌ హాసన్‌ తో పాటు కలిసి నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాలున్న ఈ చిత్రంలో కాజల్‌ చేస్తున్న పాత్రపై పలు రకాల అనుమానాలు ఉన్నాయి.

ఇండియన్‌ 2 లో కాజల్‌ పాత్ర గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో కాజల్‌ స్వయంగా స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది. ఒక ఇంటర్వ్యూలో కాజల్‌ మాట్లాడుతూ.. ఇండియన్‌ 2 చిత్రం కోసం శంకర్‌ గారు నన్ను సంప్రదించిన సమయంలో ఎలాంటి పాత్ర ఇస్తారో అని భయపడ్డాను. కాని షూటింగ్‌ ప్రారంభం అయిన తర్వాత ఆ భయం అంతా పోయింది. ఈ చిత్రంలో అంతా భావిస్తున్నట్లుగానే నేను 85 ఏళ్ల ముసలమ్మ పాత్రల్లో కనిపించబోతున్నాను.

కథలో చాలా కీలకమైన పాత్ర నాది. సినిమాలో కమల్‌ హాసన్‌ గారి తర్వాత అంతటి ప్రాముఖ్యత ఉన్న పాత్ర నాదే. అందుకే ఈ చిత్రంలో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. నా ఇమేజ్‌ పూర్తిగా మారిపోవడంతో పాటు నా కెరీర్‌ కు ఒక మైల్‌ స్టోన్‌ లా ఈ పాత్ర నిలుస్తుందని ఈ సందర్బంగా కాజల్‌ చెప్పుకొచ్చింది. ఈ పాత్రకు నేను న్యాయం చేయగలనా అని మొదట అనుకున్నాను. కాని మేకప్‌ మరియు ఇతరత్ర విషయాల కారణంగా ఖచ్చితంగా ఈ పాత్ర నా కెరీర్‌ లో నిలిచి పోతుందనిపిస్తుంది.

ఇండియన్‌ 2 చిత్రంలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఆ విషయంపై యూనిట్‌ సభ్యుల నుండి ఇంకా క్లారిటీ రాలేదు. ఈ ఏడాది చివర్లోనే ఇండియన్‌ 2 చిత్రం విడుదల చేయాలని శంకర్‌ ప్లాన్‌ చేస్తున్నారు.