ఫస్ట్ లుక్: ఐటీ స్కామ్ లో చందమామ

Fri Feb 21 2020 13:44:33 GMT+0530 (IST)

Kajal Agarwal First Look From Mosagallu Movie

మంచు విష్ణు.. కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'మోసగాళ్ళు'. సీనియర్ బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు జెఫ్రీ చిన్.  మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా ఈరోజు 'మోసగాళ్ళు' టీమ్ కాజల్ అగర్వాల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసింది.ఈ సినిమాలో కాజల్ పోషిస్తున్న పాత్ర పేరు 'అను' అంటూ వెల్లడించారు.  స్లీవ్ లెస్ బ్లేజర్ ధరించి.. చెవులకు వెడల్పాటి ఇయర్ రింగ్స్.. చేతికి వాచ్ తో ఓ సాఫ్ట్ వేర్ ప్రొఫెషనల్ తరహాలో నిలుచుంది.  ఈ సినిమా కథ ప్రపంచంలోని అతి పెద్ద ఐటీ స్కామ్ కు సంబంధించినదని పోస్టర్ లో కూడా చెప్పారు.  మరి బ్యూటిఫుల్ కాజల్ ఆ స్కామ్ లో పాత్రధారి.. సూత్రధారి అవుతుందా లేక స్కామ్ కు వ్యతిరేకంగా పనిచేస్తుందా అనేది ఆసక్తికరం.

ఈమధ్యే 'మోసగాళ్ళు' టీమ్ అమెరికాలో ఒక షెడ్యూల్ పూర్తిచేసుకుని వచ్చారని.. త్వరలో హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం అవుతుందని సమాచారం.  ఈ సినిమాను ఈ ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.  ఎవీఎ ఎంటర్టైన్మెంట్.. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.