గ్లో మిస్ అయ్యిందేంటి చందమామ!

Tue May 21 2019 10:51:16 GMT+0530 (IST)

Kajal Agarwal At Sita Pre Release Event

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఏళ్లకు ఏళ్లు గడిచినా.. వయసు మీద పడుతున్నా ఎంతకూ తగ్గని ఛార్మ్ తో వెలిగిపోయే నటీమణుల్లో  తెలుగు చందమామ కాజల్ ఒకరు. తాజాగా ఆమె నటించిన సీత ఈ వారం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రీరిలీజ్ ఫంక్షన్ ను నిర్వహించారు. ఈ వేడుకకు హాజరైన కాజల్ ను చూసినోళ్లంతా అవాక్కు అయ్యే పరిస్థితి.కళకళలాడే ముఖారవిందం కాస్తా కళ తప్పినట్లుగా ఉండటం పలువురు దృష్టి ఆమె మీద పడేలా చేసింది. ముఖం డల్ గా ఉండటం.. బాగా అలిసిపోయినట్లుగా ఉండటమే కాదు.. గతంలో మాదిరి గ్లో లేకుండా ఉండటం కనిపించింది. ఎందుకిలా అంటే.. ఆమె మేకప్పే దానికి కారణంగా చెబుతున్నారు.

ఏ మాత్రం సూట్ కాని ఐ షాడో ను వాడటం ఒక ఎత్తు అయితే.. ఆమె క్యాస్టూమ్స్ కు ఏ మాత్రం సూట్ కాని రీతిలో లిప్ స్టిక్ కూడా దెబ్బేసిందని చెప్పక తప్పదు. ఏజ్ మీద పడుతున్నప్పుడు.. కొత్త నీరు వేగంగా దూసుకొస్తున్న వేళ.. ప్రతి విషయంలో ఆచితూచి అన్నట్లుగా ఉండాల్సిన కాజల్.. ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నది ఒక ప్రశ్న.

గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు లుక్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల్ని కాజల్ కు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. విడిగా ఎలా ఉన్నా.. ఫంక్షన్లకు హాజరయ్యే వేళలో మాత్రం ఆమె చాలా జాగ్రత్తగా ఉంటారన్న పేరుంది. అందుకు భిన్నంగా తాజా ఆమె లుక్స్ మారిపోవటమే కాదు.. కళ తప్పిన చందమామకు తగ్గట్లే ఉంది. ఇలా అయితే ఎలా చందమామ?