సమంత 'ఊ అంటావా మావ' ను బీట్ చేసిన 'కచ్చా బాదం'..!

Wed Dec 07 2022 09:31:11 GMT+0530 (India Standard Time)

'Kaccha Badam' Song Beat The Samantha 'Oo Antava Mava' Song

2022 సంవత్సరం ముగింపు దశకు చేరుకోవడంతో ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం యూట్యూబ్ ఎప్పటిలాగే ఆల్ టైమ్ బెస్ట్ సాంగ్స్ లిస్టును తాజాగా ప్రకటించింది. 2022 ‘ఏ ఇయర్ ఆన్ యూట్యూబ్’ వార్షిక భారతీయ జాబితాలో వీడియో స్ట్రీమింగ్ సైట్లో బాగా పాపులరైన 10 ఉత్తమ మ్యూజిక్ వీడియోల లిస్టును వెల్లడించింది.ఈ జాబితాలో అల్లు అర్జున్ రీ సెంట్ బ్లాక్ బస్టర్ మూవీలోని పలు పాటలు చోటు సంపాదించుకోవడం విశేషం. ఈ జాబితాలో ‘పుష్ప’లోని ‘శ్రీవల్లి’ పాట అత్యధిక వ్యూస్ తో తొలి స్థానంలో నిలవడం విశేషం. అలాగే ఇదే సినిమాలోని ‘సామీ.. సామీ’.. ‘ఊ అంటవా మావ.. ఊఊ అంటవా మావ’ పాటలు సైతం చోటు సంపాదించుకున్నాయి.

‘పుష్ప’లో సమంత చేసిన ఐటమ్ సాంగ్ కు సినిమాకు హైలెట్ గా నిలిచింది. సమంత నటించిన తొలి ఐటమ్ సాంగ్ కావడంతో ఈ పాటపై తొలి నుంచి అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ఆ పాట సెన్సేషనల్ సృష్టించింది. ఈ పాట సమంత బోల్డ్ గా నటించి కుర్రకారును కట్టిపడేసింది. ఈ సాంగ్ యూట్యూబ్ లో విడుదలైనప్పటి నుంచి తెగ ట్రెండింగ్ అవుతూ వచ్చింది.

యూట్యూబ్ ట్రెండ్-2022 జాబితాలోని టాప్ 10 సాంగ్స్ లోనూ ‘ఊ అంటావా మావ... ఊఊ అంటవా మావ’ చోటు సంపాదించుకుంది. ఈ పాట హిందీ వర్షన్ లో 344 వ్యూస్ తో ఆరో స్థానంలో ఉండగా తెలుగు వర్షన్ లో ఏడో స్థానంలో నిలిచింది. అయితే సమంత స్పెషల్ సాంగ్ ను భుబన్ బద్యాకర్ కు చెందిన మ్యూజిక్ వీడియో కచ్చా బాదం బీట్ చేసింది.

‘కచ్చా బాదం’ పాట యూట్యూబ్ 2022 ట్రెండ్స్ లో ఏకంగా నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. భుబన్ బద్యాకర్ కు చెందిన ‘కచ్చా బాదం’ మరోసారి మ్యాజిక్ సృష్టించింది. దేశవ్యాప్తంగా ‘కచ్చా బాదం’ పాపులర్ కావడంతో సమంత ‘ఊ అంటవా మావా.. ఊఊ అంటవా మావ’ పాటను బీట్ చేసింది.

దళపతి విజయ్ ‘బీస్ట్’ పాట అరబిక్ కుతును సైతం వెనక్కి నెట్టింది. ఈ జాబితాలో అరబిక్ కుతు పాట తొమ్మిదో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో పుష్ప ‘శ్రీవల్లి’ 544 మిలియన్ వ్యూస్‌తో నిలిచింది. యూట్యూబ్ ప్రకటించిన టాప్ టెన్ సాంగ్స్ లో బాలీవుడ్ చిత్రాలకు సంబంధించిన ఒక్క పాట కూడా చోటు దక్కించుకోకపోవడం గమనార్హం.