Begin typing your search above and press return to search.

మీరా చోప్రా ట్వీట్ కి స్పందించిన కేటీఆర్ ఏమన్నారంటే...!

By:  Tupaki Desk   |   5 Jun 2020 12:30 PM GMT
మీరా చోప్రా ట్వీట్ కి స్పందించిన కేటీఆర్ ఏమన్నారంటే...!
X
టాలీవుడ్ లో కనుమరుగైన 'బంగారం' హీరోయిన్ మీరా చోప్రా అనూహ్యరీతిలో తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ తనపై అనుచితంగా అసభ్యకరంగా వ్యాఖ్యలు చేస్తున్నారంటూ మీరా చోప్రా ట్విటర్‌ ద్వారా హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మీరా చోప్రా పోలీసులకు ఫిర్యాదు చేయడమే కాకుండా మంత్రి కేటీఆర్.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవితను ట్యాగ్ చేస్తూ ఈ వ్యవహారాన్ని వారి దృష్టికి కూడా తీసుకెళ్లింది. తనపై సామూహిక అత్యాచారం యాసిడ్ దాడి వంటి వాటికి పాల్పడతామని బెదిరిస్తున్నారని ట్వీట్‌ లో పేర్కొన్నారు. ''కేటీఆర్, కవిత గారూ.. సామూహిక అత్యాచారం యాసిడ్ దాడి బెదిరింపులు మీ రాష్ట్రంలోని కొందరి నుంచి నాకు వస్తున్నాయి. దీనిపై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశా. మహిళల భద్రత కోసం ప్రాధాన్యం ఉన్న అంశంగా పరిగణించి పరిష్కరిస్తారని ఆశిస్తున్నా'' అని ట్వీట్ చేశారు. దీనిపై తాను చేసిన ఫిర్యాదును పరిష్కరిస్తారని ఆశిస్తున్నట్లుగా ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

కాగా హీరోయిన్ మీరా చోప్రా ట్వీట్‌ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. ''మేడమ్.. ఈ విషయంపై నేను తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసులతో మాట్లాడాను. మీ కంప్లైంట్ ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని వారిని కోరాను'' అని మంత్రి కేటీఆర్ ట్వీట్ చేసారు. తన కంప్లైన్ట్ పై మినిస్టర్ కేటీఆర్ స్పందించడంతో మీరా చోప్రా ఆయనకి ధన్యవాదాలు తెలిపారు. ''థ్యాంక్యూ సార్.. ఇది మహిళ భద్రతకు ఎంతో ముఖ్యమైనది. మహిళల పట్ల నేరాలకు పాల్పడే క్రిమినల్స్‌‌‌ ను వదిలిపెట్టకూడదు'' అని ట్వీట్ చేశారు మీరా చోప్రా. ఇటీవల మీరా చోప్రా ట్విట్టర్ చిట్ చాట్ లో తనకు ఎన్టీఆర్ కంటే మహేష్ బాబు అంటే ఇష్టమని పేర్కొంది. ఆమె వ్యాఖ్యలు ఎన్టీఆర్ అభిమానులకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. దీంతో ట్విట్టర్ వేదికగా ఆమెను ట్రోలింగ్ చేయడమే కాకుండా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీరా చోప్రా ట్విట్టర్ ద్వారా హైదరాబాద్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. హైదరాబాద్ పోలీసులు మీరా కేసును ఆధారంగా చేసుకుని దర్యాప్తు చేపట్టి 8 ట్విట్టర్ ఖాతాల నుంచే అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. పోలీసులు వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు.