Begin typing your search above and press return to search.

‘అభిలాష’ బడ్జెట్‌ నిజంగా తిట్టేలానే ఉంది

By:  Tupaki Desk   |   13 Aug 2020 12:30 AM GMT
‘అభిలాష’ బడ్జెట్‌ నిజంగా తిట్టేలానే ఉంది
X
క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బ్యానర్‌ లో వచ్చిన ఎన్నో సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. నిర్మాత కేఎస్‌ రామారావు టాలీవుడ్‌ లో మోస్ట్‌ సక్సెస్‌ ఫుల్‌ డైరెక్టర్స్‌ లో ఒకరిగా నిలిచారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. క్రియేటివ్‌ కమర్షియల్స్‌ కేఎస్‌ రామారావు పలు సందర్బాల్లో చిరంజీవిపై తనకున్న అభిమానంను చెప్పకనే చెప్పారు. అందుకు కారణం చిరంజీవి హీరోగా కేఎస్‌ రామారావు నిర్మించిన అభిలాష చిత్రం. ఆ చిత్రంతో కేఎస్‌ రామారావు పూర్తి స్థాయి నిర్మాతగా మారిపోయారు.

తాజాగా ఆ సినిమాకు సంబంధించిన విషయాలను మరియు అప్పటి జ్ఞాపకాలను రామారావు ఒక టాక్‌ షో లో నెమరవేసుకున్నారు. ఒక మంచి టెక్నీషియన్‌ అవ్వాలని చెన్నై వెళ్లి కేఎస్‌ ప్రకాశ్‌ గారి వద్ద శిష్యుడిగా జాయిన్‌ అయ్యాను. ఆయన వద్ద మూడు సినిమాలకు అసిస్టెంట్‌ గా చేశాను. నేను సినిమాలకు సంబంధించిన పబ్లిసిటీని రేడియో మరియు దూరదర్శిన్‌ లో చూసుకునేవాడిని. దాంతో నన్ను రేడియో రామారావు అనే వారు. ఒక కన్నడ సినిమాను డబ్బింగ్‌ చేసి విడుదల చేయగా మంచి పేరు వచ్చింది. దాంతో వరుసగా డబ్బింగ్‌ సినిమాలు చేశాను. ఆ తర్వాత డైరెక్ట్‌ చిత్రాలను నిర్మించాలనే ఉద్దేశ్యంతో యండమూరి గారిని కలిశాను. ఆయన అభిలాష కథ రాస్తున్నట్లుగా చెప్పారు.

ఆ కథను చిరంజీవి గారి వద్దకు తీసుకు వెళ్లాను. చిరంజీవి గారి అమ్మగారు కూడా ఆ కథ విని బాగుందన్నారు. సినిమా స్క్రిప్ట్‌ ను సత్యానంద్‌.. సత్యమూర్తి.. యండమూరి.. కోదండరామిరెడ్డి గారు కలిసి రెడీ చేశారు. ఆ సినిమా బడ్జెట్‌ కేవలం 16.5 లక్షలు. అప్పటికే చిరంజీవికి మంచి మార్కెట్‌ ఉంది. అయినా కూడా అంత తక్కువ బడ్జెట్‌ కు ఒప్పుకోవడానికి కారణం కొత్త నిర్మాత అని కావచ్చు. నిజంగానే చిరంజీవి ఫ్యాన్స్‌ ఇప్పుడు ఆ బడ్జెట్‌ ఏంటీ అని కేఎస్‌ రామారావును తిట్టేలా ఉంది. ఆ సినిమాతో వచ్చిన లాభాలతో చెన్నైలో ఇళ్లు కట్టుకోవడంతో పాటు నిర్మాతగా కేఎస్‌ రామారావు సెటిల్‌ అయ్యాడు. అందుకే చిరు అంటే రామారావుకు ప్రత్యేకమైన అభిమానం గౌరవం.