Begin typing your search above and press return to search.

కేజీఎఫ్2 భారీ క్లైమాక్స్ కు రంగం సిద్ధం.. ఎక్కడంటే?

By:  Tupaki Desk   |   18 Oct 2020 1:30 AM GMT
కేజీఎఫ్2 భారీ క్లైమాక్స్ కు రంగం సిద్ధం.. ఎక్కడంటే?
X
కేజీఎఫ్ చిత్రం కన్నడతోపాటు విడుదలైన అన్ని భాషల్లోనూ ఘనవిజయం సాధించింది. ఈ మూవీకి సిక్వెల్ గా ‘కేజీఎఫ్-2’ తెరకెక్కింది. ఈ మూవీ ఇప్పటికే థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా కరోనాతో వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీగా ‘కేజీఎఫ్-2’ ప్రేక్షకుల ముందుకు రాబోతుండటంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

కన్నడ హీరో యశ్ ‘కేజీఎఫ్’లో హీరోగా నటించాడు. కేజీఎఫ్ మొదటి పార్ట్ భారీ విజయం సాధించడంతో ‘కేజీఎఫ్-2’పై అంచనాలు పెరిగాయి. ‘బాహుబలి’ సీరిసుల మాదిరిగానే ‘కేజీఎఫ్’ కూడా విజయం సాధిస్తుందని దర్శక, నిర్మాతలు భావిస్తున్నారు. దీంతోనే ఓటీటీలో ఈ సినిమాకు వంద కోట్ల ఆఫర్ వచ్చినా థియేటర్లలోనే విడుదల చేసేందుకు చిత్రయూనిట్ మొగ్గుచూపింది.

ప్రస్తుతం తీస్తున్న రెండో పార్ట్ మొదటి దానికంటే భారీ స్థాయిలో తీస్తున్నారట.. యాక్షన్ సన్నివేశాలు గగొర్పొడిచేలా ఉంటాయట.. ఈ క్రమంలోనే సినిమాలో భారీ క్లైమాక్స్ కు ప్లాన్ చేసినట్టు తెలిసింది.

ఈ సినిమా హీరో యశ్ తోపాటు బాలీవుడ్ హీరో.. ఈ సినిమాలో విలన్ గా చేస్తున్న సంజయ్ దత్ ల మధ్య భీకర పోరాట సన్నివేశాన్ని క్లైమాక్స్ లో ప్లాన్ చేశారట.. ఈ క్లైమాక్స్ ను హైదరాబాద్ లో తెరకెక్కించుకున్నారని సమాచారం.

ఇటీవలే హైదరాబాద్ కు యష్ చేరుకున్నారు. అలాగే సంజయ్ దత్ కూడా రాబోతున్నారట.. భారీ క్లైమాక్స్ ను నవంబర్ మొదటి వారం నుంచి తెరకెక్కించనున్నట్లు సమాచారం. ఈ భారీ ప్రాజెక్ట్ సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.