'కేజీఎఫ్ 2' మళ్లీ వాయిదా.. కారణాలు రెండు

Sun Nov 28 2021 20:00:01 GMT+0530 (IST)

KGF2 postponed again

కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన కేజీఎఫ్ చిత్రం ఎంతటి ఘన విజయంను దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పాన్ ఇండియా రేంజ్ లో కేజీఎఫ్ సినిమా భారీ వసూళ్లను దక్కించుకుని సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ కు సీక్వెల్ గా రూపొందిన కేజీఎఫ్ 2 విడుదల తేదీ విషయంలో ఇప్పటికే పలు సార్లు మార్పు వచ్చింది. కరోనా కారణంగా అదుగో ఇదుగో అంటూ సినిమాను ఇన్నాళ్లు వాయిదా వేస్తూ వచ్చారు. ఎట్టకేలకు 2022 ఏప్రిల్ 14న విడుదల కాబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. విడుదల తేదీకి ఇంకా నాలుగు నెలలకు ఎక్కువే ఉంది. కనుక ఏ ప్యాచ్ వర్క్ ఉన్నా కూడా ఈ లోపు పూర్తి అవ్వడం ఖాయం అంటూ అంతా నమ్మకంగా ఉన్నారు.వచ్చే ఏడాది సమ్మర్ లో మళ్లీ కేజీఎఫ్ దేశ వ్యాప్తంగా సంచలనంగా నిలువబోతుందని అంటున్నారు. కేజీఎఫ్ 1 సాధించిన వసూళ్లతో పోల్చితే రెండు లేదా మూడు రెట్లు అధిక వసూళ్లను కేజీఎఫ్ 2 దక్కించుకుంటుందనే నమ్మకంను ట్రేడ్ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు .అంతటి అంచనాలున్న కేజీఎఫ్ 2 ను మళ్లీ వాయిదా వేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. భారీ అంచనాలున్న కేజీఎఫ్ 2 సినిమా చిత్రీకరణ పూర్తి అయ్యి చాలా నెలలు అవుతుంది. మళ్లీ ఎందుకు విడుదల వాయిదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే కన్నడ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం కేజీఎఫ్ 2 కు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను రీ షూట్ చేయాలనుకుంటున్నారట.

రీ షూట్ తో పాటు వీఎఫ్‌ఎక్స్ వర్క్ కు సంబంధించి కూడా కొన్ని సన్నివేశాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అందుకు కూడా ఆరు నెలల సమయం వరకు పడుతుందని అంటున్నారు. కనుక సినిమా విడుదల వచ్చే సమ్మర్ లో ఉండదని కన్నడ మీడియా వర్గాల వారితో చిత్ర యూనిట్ సభ్యులు అన్నట్లుగా తెలుస్తోంది. కేజీఎఫ్ 2 సినిమా చిత్రీకరణ మళ్లీ మొదలు పెడితే పూర్తి అయ్యేది ఎప్పుడో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. షూటింగ్ కాస్త ఎక్కువ చేయాల్సి వస్తే ఖచ్చితంగా సినిమా విడుదల వచ్చే ఏడాది చివరి వరకు ఉండక పోవచ్చు అనే టాక్ వినిపిస్తుంది. రీ షూట్ ఒక కారణం కాగా.. విడుదల విషయంలో స్పష్టత ఇవ్వక పోవడంకు కారణం విడుదలకు సరైన సమయం దొరకడం లేదట. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల చేయాల్సి ఉంది. కనుక ఏ భాషలో కూడా ఆ సమయంలో పెద్ద సినిమాలు లేకుండా చూసుకోవాలి. అది కాస్త ఇబ్బందిగా అవుతున్నట్లుగా తెలుస్తోంది.