Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ కోసం కేజీఎఫ్ ఫార్ములా.. నిజ‌మేనా?

By:  Tupaki Desk   |   3 July 2022 12:30 AM GMT
ప్ర‌భాస్ కోసం కేజీఎఫ్ ఫార్ములా.. నిజ‌మేనా?
X
ద‌క్షిణాదిలో సీక్వెల్స్ ట్రెండ్ న‌డుస్తోంది. ఏ స్టార్ హీరో క్రేజీ మూవీ గురించి ఆరాతీసినా ఇదే మాట వినిపిస్తోంది. రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన బాహుబ‌లి, రీసెంట్ గా ప్ర‌శాంత్ నీల్ నుంచి వ‌చ్చిన 'కేజీఎఫ్' సినిమాలు బ్యాక్ టు బ్యాక్ భారీ స్థాయిలో పాన్ ఇండియా వైడ్ గా బ్లాక్ బ‌స్ట‌ర్ లు గా నిల‌వ‌డంతో ఇదే ఫార్ములాతో త్వ‌రలో 'పుష్ప 2' కూడా రాబోతున్నా విష‌యం తెలిసిందే. త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి రాబోతోంది. మారిన స‌మీక‌ర‌ణాల‌ని దృష్టిలో పెట్టుకుని మేక‌ర్స్, డైరెక్ట‌ర్ సుకుమార్ ఫ‌స్ట్ పార్ట్ కి మించి పార్ట్ 2 తో లాభాల్ని ఆశిస్తున్నార‌ట‌.

ఇప్ప‌డు ఇదే జాబితాలోకి ప్ర‌భాస్ న‌టిస్తున్న 'స‌లార్‌' కూడా చేర‌బోతోందంటూ వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌శాంత్ నీల్ - ప్ర‌భాస్ ల తొలి క‌ల‌యిక‌లో రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచ‌నాలున్నాయి. ఫ‌స్ట్ లుక్ , టైటిల్ పోస్ట‌ర్ బ‌య‌టికి వ‌చ్చిన ద‌గ్గ‌రి నుంచే ట్రేడ్ స‌ర్కిల్స్ లో ఈ మూవీపై హాట్ చ‌ర్చ‌కూడా మొద‌లైంది. ప్ర‌భాస్ ఫ్యాన్స్ తో పాటు సాధార‌ణ ప్రేక్ష‌కులు సైతం ఈ మూవీ కోసం ఈగ‌ర్ గా వెయిట్ చేస్తున్నారు.

'కేజీఎఫ్ 2' సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న నేప‌థ్యంలో ప్ర‌శాంత్ నీల్ - ప్ర‌భాస్ ల క‌ల‌యిక‌లో రానున్న ఈ మూవీ మ‌రెన్ని సంచ‌ల‌నాకు కేంద్ర బిందువుగా మారుతుందో అని ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇటీవ‌లే ఈ మూవీ తాజా షెడ్యూల్ హైద‌రాబాద్ లో మొద‌లైంది. ప‌లు యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. 'కేజీఎఫ్' కు మించి హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా రూపొందుతున్న ఈ మూవీకి యాక్ష‌న్ సీన్స్ ప్ర‌ధాన హైలైట్ గా నిల‌వ‌నున్నాయ‌ట‌.

ఇప్ప‌టి వ‌ర‌కు ఐదు యాక్ష‌న్ సీన్ ల‌ని షూట్ చేశార‌ని, ప్ర‌స్తుతం చిత్రీక‌రిస్తున్న ఫైట్ సీక్వెన్స్ ఆర‌వ ద‌ని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఈ మూవీకి సంబంధించిన ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని ప్ర‌భాస్ ఫ్యాన్స్ నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు. ఈ మూవీ 'కేజీఎఫ్' త‌ర‌హాలో టు పార్ట్స్ గా రాబోతోంద‌ని ప్ర‌చారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఫైట్ సీక్వెన్స్ ల‌ని భారీగా ముందే షూట్ చేస్తున్నార‌ని, రెండు భాగాల‌కు సంబంధించిన షూటింగ్ ప్ర‌స్తుతం జ‌రుగుతోంద‌ని చెబుతున్నారు.

ఈ రెండు భాగాల‌తో ఇప్ప‌టి వ‌ర‌కు వున్న రాకార్డ్స్ ని ప్ర‌భాస్ తిర‌గ‌రాస్తార‌ని, ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే 'స‌లార్‌' తిరుగులేని బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలుస్తుంద‌ని ఫ్యాన్స్ భావిస్తున్నార‌ట‌. ఇదే విష‌యాన్ని నెట్టింట ప్ర‌చారం చేస్తుండ‌టంతో అంతా ఇది నిజ‌మేనా అని ఆరాతీస్తున్నారు. గ‌తంలోనూ ఇదే త‌ర‌హా వార్త‌లు ఈ మూవీపై పుట్టుకొచ్చాయి. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో మ‌ళ‌యాల హీరో పృథ్వీరాజ్ సుకుమార‌న్ న‌టించ‌బోతున్నారు.