పుష్పరాజ్ ని కొట్టిన మొనగాడితో 'కేజీఎఫ్' బ్యానర్ సినిమా!

Sat Oct 01 2022 05:00:02 GMT+0530 (India Standard Time)

KGF banner movie with fahadh faasil

`కేజీఎఫ్` హిట్ తో  హోంబలే ఫిల్మ్స్ పాన్ ఇండియా వైడ్ ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఒక్క హిట్ తో  నయా బ్యానర్ గా వెలిగిపోతుంది. భారీ బడ్జెట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచింది. సౌత్ హీరోలందర్నీ టార్గెట్ చేయడం మొదలు పెట్టింది. ప్రసత్తం ఈ బ్యానర్ కన్నడలో సినిమాలు నిర్మిస్తూనే కోలీవుడ్..టాలీవుడ్  హీరోలతోనూ భారీ వ్యయంతో సినిమాలు నిర్మించడానికి రెడీ అవుతోన్న సంగతి  తెలిసిందే.ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో `సలార్` చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది. కేజీఎఫ్ ని మంచి బడ్జెట్ `సలార్` కోసం కేటాయించింది. నిర్మాణ పరంగా ఎక్కడా రాజీ లేకుండా ముందుకు సాగుతుంది. అటు కన్నడలో పరిమిత బడ్జెట్ లోనూ కొన్ని సినిమాలు నిర్మిస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా మలయాళ నటుడు పహద్ పాసిల్ హీరోగా ఓ సినిమా నిర్మించడానికి రెడీ అవుతోంది.

ఈ సినిమా కి `ధూమం `అనే టైటిల్ ఖరారు చేసారు.. ఇందులో పహాద్ జోడీగా `ఆకాశమే నీ హద్దురా` హీరోయిన్ అపర్ణ బాలమురళీ ని ఎంపిక చేసారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ హోంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా వేదిక పంచుకుంది.  దానికి సంబంధించి ఇంట్రెస్టింగ్ పోస్ట్ కూడా పెట్టింది. `ఏ విత్తనం వేస్తే అదే పంట చేతి కొస్తుంది. మా ధూమమ్ షూటింగ్ అక్టోబర్ 9న ప్రారంభమవుతుంది. 2023 వేసవిలో పూర్తవుతుంది` రిలీల్ చేసారు.

ఆ పోస్ట్‌కి ఫహాద్.. అపర్ణ.. నిర్మాత విజయ్ కిరంగదూర్ వంటి పలువురిని ట్యాగ్ చేశారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీకి `లూసియా`.. `యు-టర్న్` చిత్రాలతో  గుర్తింపు పొందిన పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మలయాళం.. కన్నడ.. తమిళం.. తెలుగు భాషలలో విడుదల చేస్తున్నారు. పహాద్ మలయాళంలో పేరున్న నటుడు.

పుష్ప సినిమాలో ఎస్పీ  బన్వర్ సింగ్  షెకావత్ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ద్వితియార్ధం క్లైమాక్స్ లో వచ్చినా ఆ పాత్ర సత్తా ఏంటన్నది ? రెండవ భాగంలో చూపించనున్నారు. పుష్పరాజ్..షెకావత్ పాత్రలు నువ్వా?  నేనా? అన్న చందంగా పోటీ  పోటీగా సాగనున్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియా వైడ్ పహాద్ కి మంచి  పేరొచ్చింది. ఈ నేపథ్యంలో హంబోలే ఫిల్మ్స్ సౌత్ భాషలన్నింటిలోనూ పహాద్ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.