కేజీఎఫ్ స్టార్ యష్ నెక్స్ట్ మూవీ అదేనట..!

Thu Jun 17 2021 23:00:01 GMT+0530 (IST)

KGF Star Yash Next Movie

కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్డం సొంతం చేసుకున్నాడు కన్నడ హీరో యష్. ఒక్కసారిగా కేజీఎఫ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిందనే చెప్పాలి. అలాగే హీరో యష్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా అమాంతం పెరిగిపోయింది. అయితే కెజిఎఫ్2 తర్వాత అభిమాన హీరో ఏ చిత్రంలో నటిస్తాడని యష్ అభిమానులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ ప్రశ్నకు సమాధానంగా యష్ తదుపరి చిత్రం గురించి సినీపరిశ్రమలో కొన్ని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 'ముఫ్తీ' మూవీ ఫేమ్ నర్తన్.. కేజీఎఫ్ స్టార్ యష్ తదుపరి చిత్రానికి దర్శకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది.నిజానికి డైరెక్టర్ నర్తన్.. స్టార్ హీరో శివరాజ్ కుమార్ 125వ 'భరతి రణగల్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఎందుకోగాని శివరాజ్ సినిమా వాయిదా పడింది. వెంటనే దర్శకుడు యష్ తో చేతులు కలిపాడు. అయితే శివరాజ్ కంటే ముందే యష్ కు ఓకే చెప్పానని ఇదివరకు ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు డైరెక్టర్. ఈలోగా అతను శివరాజ్ తో 'భరతి రణగల్'లో ప్రారంభం చేసే సందర్బం ఒకేసారి రావడంతో ఈ రెండు ప్రాజెక్టులలో ఫస్ట్ అంగీకరించిన ప్రాజెక్టును ఫినిష్ చేయనున్నట్లు నర్తన్ క్లారిటీ ఇచ్చాడు. అంటే యష్ తోనే తదుపరి సినిమా అని చెప్పకనే చెప్పేసాడు.

యష్ తో సినిమా అయిపోయాక శివరాజ్‌కుమార్‌తో కలిసి భ్రమతి రణగల్‌లో మళ్లీ పనిచేయాలని భావిస్తున్నట్లు ప్రస్తుతం కథనాలు చెబుతున్నాయి. మొన్నటివరకు యష్ తదుపరి సినిమా బాలీవుడ్ డైరెక్టర్ తో.. టాలీవుడ్ డైరెక్టర్ తో అంటూ పుకార్లు వచ్చాయి. కానీ ఇటీవల దర్శకుడు అందించిన సమాచారం ప్రకారం.. యష్ తదుపరి చిత్రం కోసం ఆల్రెడీ ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభమైనట్లు తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించనున్నారు. కన్నడ సినీవర్గాల ప్రకారం.. ఈ సినిమాకు జటస్య అనే పేరును పరిశీలిస్తున్నట్లు టాక్. అలాగే ఈ సినిమాలో యష్ సరసన మిల్కీబ్యూటీ తమన్నా నటించనుందని వార్తలొస్తున్నాయి. మలేయ్ త్వరలోనే ఆఫీసియల్ కన్ఫర్మేషన్ రానుందేమో చూడాలి.