టిఆర్పి రేటింగులో కూడా రికార్డు బద్దలుకొట్టిన డబ్బింగ్ మూవీ!!

Thu Jul 16 2020 22:00:13 GMT+0530 (IST)

KGF Movie TRP Ratings On Small Screen

కొన్ని డబ్బింగ్ సినిమాలు అసలు ఎప్పుడు వచ్చాయో ఎప్పుడు వెళ్ళాయో తెలియకుండా ఉంటాయి. మరికొన్ని సినిమాలు ఎప్పుడు వస్తాయో తెలియదు అనేలా ఉంటాయి. కానీ తక్కువ సినిమాలు మాత్రమే థియేటర్లో చూసినా చూడకపోయినా టీవీలో ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తాం. అలాంటి సినిమాలలో ఒకటి కన్నడ నుండి తెలుగులో డబ్ అయి విడుదలైన కేజీఎఫ్. 2018లో విడుదలై వెళ్ళిపోయినా ఈ సినిమా గురించి ఇప్పటికి జనాలు సినీ ప్రియులు మాట్లాడుకుంటున్నారు అంటే.. అదేదో గొప్ప విజయమే సాధించి ఉండాలి. మరి సాధించిందా..? అంటే అవుననే చెప్పాలి. అసలు ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది కేజీఎఫ్. కనీసం తెలుగువాళ్లకు హీరో తెలియదు. డైరెక్టర్ తెలియదు. కానీ సినిమా తెలుగులో భారీ హిట్. ఎందుకలా అంటే జనాలకు బాగా నచ్చింది ఆదరించేసారు. దేశంలో బాహుబలి తర్వాత ఆ రేంజ్ విజయం నమోదు చేసిందంటే మాములు విషయం కాదు.ఈ సినిమాతో కన్నడ హీరో యశ్ ఒక్కసారిగా స్టార్ హీరో అయిపోయాడు. అలాగే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. ఇక ఈ సినిమాను హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందురు నిర్మించారు. 2018లో విడుదలైన కేజీఎఫ్ అన్నీ బాషలలో మంచి విజయం అందుకుంది. అయితే మొన్నటి వరకు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కాలేదు. ఇటీవలే ఈ సినిమా తెలుగు సాటిలైట్ హక్కులను స్టార్ మా టీవీ ఛానల్ దక్కించుకుంది. జులై 5న అంటే ఆదివారం కేజీఎఫ్ సినిమా ప్రసారమై అద్భుతమైన టిఆర్పి రేటింగ్ సొంతం చేసుకుంది. దాదాపు 11.9 టిఆర్పి రేటింగ్ దక్కించుకొని తెలుగులో టాప్ 5 డబ్బింగ్ మూవీస్ హైయెస్ట్ రేటింగ్స్ లో స్థానం సంపాదించుకుంది. డబ్బింగ్ సినిమాల జాబితాలో ఇప్పటివరకు సూపర్ స్టార్ రజినీ నటించిన 'రోబో' 19.04 రేటింగ్ తో ఫస్ట్ - బిచ్చగాడు మూవీ 18.76 - కబాలి 14.52 - కాంచన 13.1.. రేటింగ్స్ తో ముందంజలో ఉండగా 11.9 తో కేజీఎఫ్ 5వ స్థానం కైవసం చేసుకుంది. ప్రస్తుతం కేజీఎఫ్ అభిమానులు - మేకర్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.