Begin typing your search above and press return to search.

KGF స్థాయిలో #NTR31: తారక్

By:  Tupaki Desk   |   24 Nov 2021 4:09 AM GMT
KGF స్థాయిలో #NTR31: తారక్
X
RRR చిత్రాన్ని రిలీజ్ కు రెడీ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్.. తదుపరి రెండు సినిమాల మీద ఇప్పటికే క్లారిటీ ఇచ్చేశారు. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా.. కన్నడ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో #NTR31 మూవీ ఉంటుందని ఆ మధ్య ప్రకటించారు.

'కేజీయఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేస్తున్నారని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ మూవీ రూపొందనుంది. అయితే లేటెస్టుగా ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని తారక్ స్వయంగా వెల్లడించారు.

తాజాగా ఓ ఆంగ్ల మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీల్ తో చేయబోయే సినిమా 2022 అక్టోబర్ లో సెట్స్ పైకి వెళ్లనుందని తెలిపారు. అంతేకాదు #NTR31 ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన KGF తరహాలో భారీ స్థాయిలో ఉంటుందని నందమూరి హీరో వెల్లడించారు.

ఈ నేపథ్యంలో తారక్ - ప్రశాంత్ ఈ సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని ఫ్యాన్స్ ఉహించుకుంటున్నారు. మాస్ అండ్ యాక్షన్ కు పెట్టింది పేరు యాక్టింగ్ పవర్ హౌస్ ఎన్టీఆర్. హీరోయిజమ్ - ఎలివేషన్స్ చూపించడంలో నీల్ స్పెషలిస్ట్. వీరిద్దరూ కలిసి చేయబోయే సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ఫిక్స్ అయ్యారు.

ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ - లుక్ ఎలా ఉంటాయో అని ఇప్పటి నుంచే చర్చలు మొదలు పెట్టేసారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో రూపొందే అవకాశం ఉంది. ఇప్పటికే 'కేజీయఫ్: చాప్టర్ 2' చిత్రాన్ని కంప్లీట్ చేసిన ప్రశాంత్ నీల్.. ప్రస్తుతం ప్రభాస్ తో 'సలార్' మూవీ చేస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చే ఏడాది అక్టోబర్ లో ఎన్టీఆర్ చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అప్పటికి కొరటాల శివ ప్రాజెక్ట్ ని పూర్తి చేసి ప్రశాంత్ నీల్ తో జాయిన్ అయ్యేలా ఎన్టీఆర్ ప్లాన్ చేసుకుంటున్నారు.

ప్రస్తుతం తన ఫ్యామిలీతో కలిసి యూరప్ హాలిడేలో ఉన్న తారక్.. ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత RRR ప్రమోషన్లలో పాల్గొననున్నారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోతారని అందరూ భావిస్తున్నారు. ఇదే క్రమంలో వచ్చే కొరటాల శివ - ప్రశాంత్ నీల్ చిత్రాలు తారక్ ను మరో స్థాయికి తీసుకెళ్తాయని అభిమానులు అభిప్రాయ పడుతున్నారు.