Begin typing your search above and press return to search.

'కేజీఎఫ్' హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అతనేనా...?

By:  Tupaki Desk   |   18 Jun 2020 7:30 AM GMT
కేజీఎఫ్ హీరో నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ అతనేనా...?
X
'కేజీఎఫ్' సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న హీరో కన్నడ రాకింగ్ స్టార్ యష్. కన్నడ సినిమా చరిత్రలోనే అత్యధికంగా వసూళ్లు అందుకున్న హీరోగా బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్ లలో కూడా బాక్సాఫీస్ రికార్డులను క్రియేట్ చేసాడు. కన్నడ హీరో కూడా పాన్ ఇండియా మూవీస్ కూడా చేయగలరని నిరూపించాడు యష్. ఒక సీరియల్ నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన యష్ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ శాండిల్ వుడ్ స్టార్ హీరో స్థాయికి ఎదిగాడు. ప్రస్తుతం 'కన్నడ బాహుబలి' అని పిలవబడుతున్న 'కేజీఎఫ్' సినిమాకి సీక్వెల్ గా 'కేజీఎఫ్' చాప్టర్ 2 సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇంకా అనౌన్స్ చేయలేదు. అయితే 'కేజీఎఫ్' సినిమా వల్ల సౌత్ ఇండస్ట్రీ స్టార్ డైరెక్టర్స్ అందరూ యష్ తో సినిమా చేయాలని ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపథ్యంలో యష్ నెక్స్ట్ సినిమా గురించి శాండిల్ వుడ్ వర్గాల్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అవుతోంది.

రాకింగ్ స్టార్ యష్ తన తదుపరి సినిమా ఒక యంగ్ డైరెక్టర్ తో చేయబోతున్నాడట. కన్నడ డైరెక్టర్ నార్తన్ తో యష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాడట. ఇప్పటికే దీనిపై యష్ - నార్తన్ మధ్య చర్చలు జరుగుతున్నాయట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలున్నాయని సమాచారం. డైరెక్టర్ నార్తన్ 2017లో 'మఫ్టీ' అనే సూపర్ హిట్ సినిమాని డైరెక్ట్ చేసాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో శివ రాజ్ కుమార్ హీరోగా నటించాడు. ప్రస్తుతం నార్తన్ తమిళ హీరో శింబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే యష్ తో సినిమా స్టార్ట్ చేసే అవకాశాలున్నాయట. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.