కేజీఎఫ్.. పుష్ప లను పోల్చుతూ ఉప్పెన దర్శకుడు చేసిన వ్యాఖ్యలు వైరల్!

Mon Jun 14 2021 12:13:16 GMT+0530 (IST)

KGF .. Comments made by the uppena director comparing pushpa are viral?

అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా రెండు పార్ట్ లుగా విడుదల కాబోతుంది. మొదటి పార్ట్ కొన్ని యాక్షన్ సన్నివేశాలు మరియు కాస్త టాకీ పార్ట్ ఇంకా పాట చిత్రీకరణ మాత్రమే బ్యాలన్స్ ఉంది. కాస్త అవకాశం ఉంటే జులై లో సినిమాను పూర్తి చేసి ముందు నుండి చెబుతున్నట్లుగా ఆగస్టులోనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. ఇక సుకుమార్ శిష్యుడు  అయిన ఉప్పెన దర్శకుడు బుచ్చి బాబు తాజాగా పుష్ప గురించి చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.బుచ్చి బాబు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన గురువు సుకుమార్ సినిమా పుష్ప ను గురించి మాట్లాడాడు. తాను సినిమాను చూశాను అని.. మొదటి పార్ట్ ఒక్కటే పది కేజీఎఫ్ సినిమాలతో సమానం అన్నాడు. అల్లు అర్జున్ నటన మరియు సుకుమార్ గారి డైరెక్షన్ తో పుష్ప సినిమా మరో లెవల్ లో ఉందంటూ బుచ్చి బాబు మరీ ఆకాశానికి లేపేలా వ్యాఖ్యలు చేశాడు. ఖచ్చితంగా పుష్ప సినిమా బ్లాక్ బస్టర్ అన్నట్లుగా బుచ్చి బాబు వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం బుచ్చి బాబు వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

పుష్ప సినిమాలోని యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ టెక్నాలజీని మరియు అత్యున్నత ఫైటర్స్ ను వినియోగిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. ప్రతి ఒక్క యాక్షన్ సన్నివేశం కూడా కేజీఎఫ్ లోని యాక్షన్ సన్నివేశాలను తలదన్నే విధంగా ఉండటంతో పాటు ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై చూడనటువంటి అద్బుతాన్ని సుకుమార్ చూపించబోతున్నట్లుగా కూడా యూనిట్ సభ్యులు చెబుతున్నారు.

బన్నీకి ఇదో రియల్ పాన్ ఇండియా మూవీగా నిలవడం ఖాయం అంటున్నారు. ఈ సినిమాలోని మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ మరియు అనసూయ లు ప్రత్యేక ఆకర్షణగా నిలువబోతున్నారని అంటున్నారు. ఇక పుష్ప సినిమాలోని ఒక పాటలో చిరంజీవి స్టెప్స్ ను కూడా చూడబోతున్నట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పుష్ప సినిమా కుమ్మేయడమే తరువాయి అన్నట్లుగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు.