Begin typing your search above and press return to search.

ఎంత సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ అయినా అది మరీ ఎక్కువ రేటు

By:  Tupaki Desk   |   22 May 2020 1:30 PM GMT
ఎంత సూపర్‌ హిట్‌ సీక్వెల్‌ అయినా అది మరీ ఎక్కువ రేటు
X
కన్నడ రాకింగ్‌ స్టార్‌ యశ్‌ హీరోగా ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్‌ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. తెలుగులో కూడా కేజీఎఫ్‌ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి కేజీఎఫ్‌ ను తెలుగులో డబ్‌ చేశాడు. ప్రస్తుతం కేజీఎఫ్‌ 2 చిత్రం రూపొందుతుంది. మొదటి పార్ట్‌ కు డబుల్‌ బడ్జెట్‌ తో భారీగా కేజీఎఫ్‌ 2 ను రూపొందిస్తున్నారు.

కేజీఎఫ్‌ 2 చిత్రాన్ని కూడా సాయి కొర్రపాటి 20 కోట్లకు డబ్బింగ్‌ రైట్స్‌ దక్కించుకునేందుకు ప్రయత్నించాడట. కాని కేజీఎఫ్‌ నిర్మాతలు చాలా పెద్ద మొత్తంను తెలుగు డబ్బింగ్‌ రైట్స్‌ నుండి ఆశిస్తున్నారట. అంత మొత్తం పెట్టడం తన వల్ల కాదంటూ సాయి కొర్రపాటి డబ్బింగ్‌ రైట్స్‌ పై ఆశలు వదిలేసినట్లుగా చెబుతున్నారు. ఈ సినిమాను తెలుగులో దిల్‌ రాజుతో కలిసి విడుదల చేయాలని కేజీఎఫ్‌ మేకర్స్‌ భావిస్తున్నారట.

దిల్‌ రాజుతో భాగస్వామ్యం లేదంటే పూర్తిగా ఆయనకు డబ్బింగ్‌ రైట్స్‌ అమ్మడం ద్వారా తెలుగు కేజీఎఫ్‌ లో ఆయన్ను భాగస్వామ్యం చేయాలని అనుకుంటున్నారు. అయితే దిల్‌ రాజు మాత్రం ఈ విపత్తు సమయంలో అంతటి భారీ మొత్తంను పెట్టేందుకు ముందుకు వస్తాడా అనేది అనుమానమే.

ప్రముఖ స్టార్‌ హీరోల సినిమాలే విడుదల విషయంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కేజీఎఫ్‌ 2 చిత్రం భారీ మొత్తంకు కొనుగోలు చేస్తే ఆ తర్వాత పరిస్థితి తలకిందులు అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.