Begin typing your search above and press return to search.

అఫిషియల్‌ : ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్‌ డేట్‌

By:  Tupaki Desk   |   13 March 2020 3:28 PM GMT
అఫిషియల్‌ : ‘కేజీఎఫ్‌ 2’ రిలీజ్‌ డేట్‌
X
కన్నడ సినిమా ‘కేజీఎఫ్‌’ సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. కేవలం కన్నడంలోనే కాకుండా హిందీ.. తెలుగు.. తమిళంలో కూడా కేజీఎఫ్‌ చిత్రం మంచి వసూళ్లను రాబట్టింది. ముఖ్యంగా ఈ చిత్రం హిందీలో భారీ వసూళ్లను రాబట్టి కన్నడ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్‌ హిట్‌ గా నిలిచింది. సౌత్‌ ఇండియా టాప్‌ చిత్రాల జాబితాలో కూడా కేజీఎఫ్‌ నిలిచింది. అలాంటి కేజీఎఫ్‌ కు సీక్వెల్‌ గా రూపొందుతున్న కేజీఎఫ్‌ 2 చిత్రం విడుదల తేదీపై గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలకు ఫుల్‌ స్టాప్‌ పెట్టారు.

మొన్నటి వరకు జులై 30న విడుదల కాబోతుందని అన్నారు.. ఆ తర్వాత ఆర్‌ఆర్‌ఆర్‌ కు పోటీ అన్నట్లుగా జనవరిలో సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు సినిమా విడుదల తేదీపై యూనిట్‌ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చేరు. పుకార్లకు ఫుల్‌ స్టాప్‌ పెట్టి అక్టోబర్‌ 23న ప్రపంచ వ్యాప్తంగా రాబోతున్నట్లుగా ప్రకటించారు. యశ్‌ ఈ చిత్రం తో మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం అన్నట్లుగా కన్నడ ప్రేక్షకుల తో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు నమ్మకంగా ఉన్నారు.

ప్రశాంత్‌ నిల్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్స్‌ సంజయ్‌ దత్‌ ఇంకా పలువురు నటిస్తున్నారు. ఈ సీక్వెల్‌ పై కన్నడం లో ఎంతగా ఆసక్తి ఉందో హిందీ ప్రేక్షకులకు కూడా అంతగా ఆసక్తి ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే హిందీ రైట్స్‌ ను ప్రముఖ నిర్మాత భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసి కొనుగోలు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.