ఎల్లలు దాటేసిన కేజీఎఫ్ క్రేజ్

Fri May 13 2022 20:06:16 GMT+0530 (IST)

KGF 2 Craze

యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కన్నడంలో రూపొందిన కేజీఎఫ్ 2 సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆర్ ఆర్ ఆర్ వసూళ్లను సైగం కేజీఎఫ్ 2 బీట్ చేసిన విషయం తెల్సిందే. ఏకంగా బాలీవుడ్ సినిమా దంగల్ హిందీ రికార్డు ను సైతం కేజీఎఫ్ బ్రేక్ చేసింది. ఇప్పుడు దంగల్ మరియు బాహుబలి 2 రికార్డు లను కూడా బ్రేక్ చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లుగా తెలుస్తోంది.దంగల్ సినిమా రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు కేజీఎఫ్ 2 ను విదేశాల్లో ఆయా భాషలతో విడుదల చేస్తే ఖచ్చితంగా భారీ గా డాలర్లు వసూళ్లు గా నమోదు అయ్యే అవకాశం ఉంది. తద్వారా ఖచ్చితంగా కేజీఎఫ్ కు అరుదైన రికార్డు లు మరిన్ని దక్కే అవకాశం ఉందంటున్నారు. సౌత్ కొరియా లో కేజీఎఫ్ 2 ను విడుదల చేయబోతున్నారు. అక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు ఇప్పటికే జరిగాయి.

కేవలం కొరియన్ భాషలోనే కాకుండా మరి కొన్ని భాషల్లో మరి కొన్ని దేశాల్లో సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో కేజీఎఫ్ 2 మేకర్స్ ఉన్నారు. మొదటి పార్ట్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కాని ఆ సినిమాను విదేశాల్లో విడుదల చేయలేదు. ఇప్పుడు కేజీఎఫ్ 2ను అక్కడ విడుదల చేయబోతున్నారు. కేజీఎఫ్ 2 ను విదేశాల్లో విడుదల చేయడం కోసం కేజీఎఫ్ 1 కథను వారికి ముందు గానే 5 నిమిషాల పాటు చూపిస్తారట.

కేజీఎఫ్ 2 సినిమా కొరియన్ భాష లో సక్సెస్ అయితే ఖచ్చితంగా చైనా లో కూడా విడుదలకు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి. గత కొంత కాలంగా చైనా ఇండియా మద్య సన్నిహిత సంబంధాలు లేవు. దాంతో సినిమా లు విడుదల కావడం లేదు. కాని ఇప్పుడు ఈ సినిమా ను అక్కడ విడుదల చేసే విధంగా చర్చలు జరుపుతున్నారని తెలుస్తోంది.

చైనాలో కేజీఎఫ్ 2 విడుదల కాకున్నా కూడా కచ్చితంగా ఇతర భాషల్లో మరియు దేశాల్లో విడుదల అయినా కూడా భారీ గా వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేజీఎఫ్ 2 ఎల్లలు దాటి అద్బుతమైన విజయం దిశగా మరింత దూకుడుగా అడుగులు వేస్తోంది.