ప్రేమ పక్షులు సడెన్ గా పెళ్లి అంటారేమో!

Fri Jun 18 2021 07:00:01 GMT+0530 (IST)

K L Rahul And Athiya shetty

బాలీవుడ్ కథానాయికల ప్రేమాటలు కాస్త విచిత్రంగానే ఉంటాయి. పెళ్లికి ముందు కొన్నాళ్ల పాటు డేటింగుల పేరుతో షికార్లు మామూలే. ఇక కలిసే ఏ ఈవెంట్ కి వెళ్లినా.. కలిసే డిన్నర్ లు బ్రంచ్ లు ఉంటాయి. ఇంతకుముందు విరుష్క జంట ఇలానే చేసింది. కొన్నాళ్ల లవ్వాయణం అనంతరం ఈ జంట ఓ వాణిజ్య ప్రకటనలో కనిపించారు. ఆ తర్వాత వన్ ఫైన్ డే సడెన్ గా డెస్టినేషన్ వెడ్డింగ్ అంటూ విదేశాలకు జంప్ అయ్యారు.చూస్తుంటే .. ఈ జంట కూడా అలానే చేయడం ఖాయంగా కనిపిస్తోంది. టీమీడియా ట్యాలెంటెడ్ ఆటగాడు కె.ఎల్.రాహుల్ తో బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి వారసురాలు ఆథియా శెట్టి నిండా ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ ఈ జంట అధికారికంగా ఇంతవరకూ ఆ విషయాన్ని ప్రకటించలేదు. కానీ తరచూ సోషల్ మీడియాల్లో జంట ఫోటోలను ప్రత్యేక సందర్భాలలో అప్ లోడ్ చేస్తారు. బుధవారం అతియా రెండు రిచ్ స్పోర్ట్ బ్రాండ్ సన్ గ్లాసెస్ ధరించిన ఫోటోలను పంచుకున్నారు. ఇది ఈ జంట మొదటి అధికారిక ఫోటోషూట్. అందుకు సంబంధించిన పెప్పీ వీడియోని రిలీజ్ చేయగా వైరల్ గా మారింది.

ఈ సంవత్సరం ప్రారంభంలో కెఎల్ రాహుల్ పుట్టినరోజున ఆథియాశెట్టి తన కోసం పుట్టినరోజు సందేశం పంపినప్పుడు కె.ఎల్ తో కలిసి ఉన్న   కొన్ని ఫోటోలను పంచుకున్నారు. ఆమె కొన్ని మిర్రర్ సెల్ఫీలను అప్ లోడ్ చేస్తూ.. ప్రియుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ జంట ఇంతకుముందు 2020లో థాయ్ లాండ్ పర్యటనకు వెళ్లినప్పటి ఫోటోలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేశారు.

కెరీర్ మ్యాటర్ కి వస్తే.. అతియా శెట్టి చివరిసారిగా మోటిచూర్ చక్నాచూర్ లో నవాజుద్దీన్ సిద్దిఖీతో కలిసి నటించారు. తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. ఆమె సోదరుడు అహన్ శెట్టి ఆర్.ఎక్స్ 100 హిందీ రీమేక్ అయిన తడాప్ తో అరంగేట్రం చేయబోతున్నాడు. ఈ చిత్రంలో తారా సుతారియా కథానాయికగా నటిస్తోంది. తాజా సన్నివేశం చూస్తుంటే క్రికెటర్ రాహుల్ తో ఆథియా ప్రేమాయణం కన్ఫామ్ అయినట్టేనా? అంటూ అభిమానులు సోషల్ మీడియాల్లో ప్రశ్నిస్తున్నారు. మరి దీనికి ఆ జంట ఏమని సమాధానమిస్తుందో చూడాలి.