Begin typing your search above and press return to search.

రావణుడిగా యశ్.. ఓకే చెప్పినట్టేనా

By:  Tupaki Desk   |   28 Jan 2023 9:46 PM GMT
రావణుడిగా యశ్.. ఓకే చెప్పినట్టేనా
X
కన్నడ స్టార్ హీరో యశ్ గురించి మనందరికీ తెలిసిందే. కేజిఎఫ్ సిరీస్ తో పాన్ ఇండియా హీరోగా దేశవ్యాప్తంగా భారీగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సిరీస్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడమే కాకుండా రికార్డు స్థాయిలో బాక్సాఫీస్ ముందు కలెక్షన్ల సునామీని సృష్టించాడు. ఇకపోతే ఈ సినిమా తర్వాత యశ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి, ఏ సినిమాలు చేస్తాడు అన్న విషయాలపై గత కొంతకాలంగా సందిగ్దత నెలకొంది.

పాన్ ఇండియా సినిమాలో నటించబోతున్నాడా? ఏ డైరెక్టర్ తో కలిసి పని చేయబోతున్నాడు? అందులో హీరోయిన్ ఎవరు? ఇలా ఎన్నో రకాల ప్రశ్నలు అభిమానుల మదిలో మెదులుతునే ఉన్నాయి. ఇప్పటికీ ఆ ప్రశ్నలపై ఉన్న క్యూరియాసిటీ పెరుగుతూనే ఉంది. ఆయన సినిమా కోసం దేశవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే యశ్ కు ఎన్నో భారీ ఆఫర్లు వచ్చాయి.

ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన ఓ చారిత్రక కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు మగ్గు చూపుతున్నట్లు తెలిసింది. బాలీవుడ్ లో తెరకెక్కబోతున్న రామాయణంలో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. రావణాసురుడు పాత్ర చేసే అవకాశం వచ్చిందని సమాచారం. "యశ్ ఓ అద్భుతమైన పాత్ర చేయాలనుకుంటున్నాడు. దీనిపై అతనికి ఓ నిర్దిష్టమైన విజన్ ఉంది. అతను ప్రస్తుతం స్క్రిప్ట్‌ లను వింటున్నాడు. అందులో నాలుగైదు స్క్రిప్ట్ లు ఫైనల్ చేశాడు. అందులో ఒకటి నితీష్ తివారీ దర్శకత్వం వహించనున్న రామాయణం. యశ్ కు ఈ చిత్ర ప్రీ-విజువలైజేషన్‌ బాగా నచ్చింది. ప్రస్తుతం అతడు రామాయన్ చిత్ర బృందంతో చర్చలు జరుపుతున్నాడు. వచ్చే 2 నెలల్లో తన తదుపరి చిత్రం గురించి ప్రకటించనున్నాడు" అని సినీ వర్గాలు తెలిపాయి.

ఒకవేళ యశ్ ఈ ప్రాజెక్టు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ సినిమా ఈ ఏడాది వేసవిలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నాయి. ఇకపోతే ఈ సినిమాలో రాముడుగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇక బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ ఓ ఆఫర్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. ఇక ఈ రామయణ్ కి నిర్మాతలుగా మధు మంతెన, అల్లు అరవింద్ వ్యవహారించనున్నారు. దాదాపు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.