Begin typing your search above and press return to search.

హాఫ్ కరోనా అనడంపై భగ్గుమన్న గుత్తాజ్వాల

By:  Tupaki Desk   |   9 April 2020 1:30 AM GMT
హాఫ్ కరోనా అనడంపై భగ్గుమన్న గుత్తాజ్వాల
X
చైనాలో పుట్టి ప్రపంచదేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ కు ఇప్పుడు ప్రపంచదేశాల్లో మరణమృదంగం వినిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది ఈ వ్యాధితో బాధపడుతుండగా.. వేల మంది చనిపోతున్నారు. దీంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సహా చాలా మంది సోషల్ మీడియా వేదికగా చైనాను - చైనీయులపై దుమ్మెత్తి పోస్తున్నారు. చైనా అంటేనే చాల మంది ఆ సంతతివారిపై వివక్ష చూపిస్తున్నారు. చైనా మూలాలున్న ప్రముఖ క్రీడాకారిణికి ఈ బాధ తప్పలేదు. తాజాగా ఇలాంటి ఆరోపణను ప్రముఖ బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాల కూడా ఎదుర్కొన్నారు.

గుత్తా జ్వాలను పరోక్షంగా విమర్శిస్తూ కొందరు 'హాఫ్ కరోనా'.. చైనాకా మాల్.. హాఫ్ చైనీస్, చింకీ అని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఎందుకంటే గుత్తా జ్వాల తండ్రి తెలుగువాడు కాగా.. తల్లిది చైనా.. దీంతో చైనా మూలాలున్న గుత్తా జ్వాలకు ఈ వివక్ష తప్పలేదు.

దీనిపై తాజాగా గుత్తా జ్వాల నిప్పులు చెరిగింది. ఇది జాత్యాంహకార దాడి అని మండిపడింది. అసలు మమ్మల్ని కాదు అనాల్సిందంటూ ఉదయం వేళ కొందరు విద్యావంతులు జాగింగ్ చేస్తూ కరోనా వ్యాప్తి చెందిస్తున్నారని.. వారిని తిట్టండని గుత్తా జ్వాల మండిపడింది.

ఇక తాను ఈ ఖాళీ టైంలో సినిమాలు, షోస్ చూస్తూ.. ఇంటి పనుల్లో సహాయం చేస్తున్నానని తెలిపింది. ఒలింపిక్స్ వాయిదా పడడం తో శారీరకంగా.. మానసికంగా ధృడంగా తయారవుతున్నానని.. ఇలా ఆరోపణలు పట్టించుకోనని నెటిజన్లకు కౌంటర్ ఇచ్చింది.