Begin typing your search above and press return to search.

ఫేమ‌స్ సింగ‌ర్ కి అరుదైన ప్రాణాంత‌క‌ వ్యాధి

By:  Tupaki Desk   |   10 Jan 2020 7:11 AM GMT
ఫేమ‌స్ సింగ‌ర్ కి అరుదైన ప్రాణాంత‌క‌ వ్యాధి
X
రోగాల‌కు ఎవ‌రూ ఎవ‌రూ అతీతులు కారు. టైమ్ బ్యాడ్ అయితే రోగం త‌ప్ప‌దు. ప్ర‌పంచం సాంకేతికంగా ఎంత వేగంగా ఎదుగుతున్నా అంతు చిక్క‌ని రోగాలు అంత‌కంత‌కు పెరిగిపోతున్నాయి. ఇంకా చెప్పాలంటే అరుదైన వ్యాధులు ధ‌న‌వంతుల‌కే ఎక్కువ‌గా వ‌స్తున్నాయ‌ని చాలా స‌ర్వేలు నిరూపించాయి. క్యాన‌ర్- ఎయిడ్స్ లాంటి ప్రాణాంత‌క‌ జ‌బ్బుల‌కు శాశ్వ‌త ప‌రిష్కారం దొర‌క‌డం లేదు. ఈ జ‌బ్బుల‌పై కొన్ని ద‌శాబ్ధాలుగా ప‌రిశోధ‌న జ‌రుగుతోన్న మందు మాత్రం క‌నిపెట్ట‌లేక‌పోతున్నారు. ఇవ‌న్నీ సైన్స్ కు దొర‌క‌నివి.

తాజాగా ఫేమ‌స్ కెనెడియ‌న్ సింగర్ జ‌స్టిన్ బీబ‌ర్ లైమ్ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న విష‌యంలో ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఈ వ్యాధి వ‌ల్ల బీబ‌ర్ బ‌క్క చిక్కిపోయాడు. బాగా నీర‌సించి క‌నిపిస్తున్నాడు. ఈ వ్యాధి మొద‌డు ప‌నితీరు స‌హా శ‌రీరంలో ఇత‌ర అవ‌య‌వాల‌పై కూడా తీవ్ర ప్ర‌భావం చూపిస్తుందిట‌. చ‌ర్మం కుంచించుకుపోయిన‌ట్లు అయిందిట‌. బీబ‌ర్ బాగా స‌న్న‌బ‌డ‌టంతో అభిమానుల‌కు సందేహం రావ‌డంతో ఇన్ స్టా గ్రామ్ వేదిక‌గా ఈ విశేషాల‌ను బీబ‌ర్ పంచుకున్నాడు. ప్ర‌స్తుతం ట్రీట్ మెంట్ జ‌రుగుతోంద‌ని తెలిపాడు.

ఈ వ్యాధి బొర్రిలియా బ‌ర్గ్ డార్ప‌రి అనే బ్యాక్టీరియా వ‌ల్ల వ‌స్తుంద‌ట‌. ఇక్సోడ్స్ అనే పేనులాంటి పురుగుల ద్వారా వ్యాపిస్తుందిట‌. అమెరికా- యూరప్ లాంటి ఉత్త‌రార్ధ గోళంలోని దేశాల్లో ఇది వేస‌వి కాలంలో వ‌చ్చే వాధి. గ‌తంలో హ‌ర్యాన- హిమాచ‌ల్ ప్ర‌దేశ్ లో ఈ వ్యాధి అన‌వాళ్లు క‌నిపించిన‌ట్లు స‌మాచారం. చ‌ర్మంపై ఎర్ర‌టి.. గుండ్ర‌ని ద‌ద్దుర్లు ఏర్ప‌డ‌తాయి. విప‌రీత‌మైన కీళ్ల‌నొప్పి ఉంటుందిట. మొద‌డు ప‌నితీరుపై ప్ర‌భావం చూపి ప‌క్ష‌వాతానికి దారి చూపి...మ‌నిషినే చంపేసే భ‌యాన‌క వ్యాధి లైమ్ అని తెలుస్తోంది. అయితే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న‌ వీరాభిమానుల ప్రార్థ‌న‌లు ఫ‌లించి బీబ‌ర్ య‌థాస్థితికి చేరాల‌ని ఆకాంక్షిద్దాం.