Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్‌: జూనియర్ ఎన్టీఆర్ లంబోర్ఘిని కార్

By:  Tupaki Desk   |   24 July 2021 4:51 AM GMT
ట్రెండీ టాక్‌: జూనియర్ ఎన్టీఆర్ లంబోర్ఘిని కార్
X
ఏడాది వెయిటింగ్ ఫ‌లించి ఎట్ట‌కేల‌కు జూనియర్ ఎన్టీఆర్ సూపర్ లగ్జరీ కార్ లంబోర్ఘినిని సొంతం చేసుకున్నారని క‌థ‌నాలొచ్చాయి. ఈ కార్ వెల రూ.5కోట్లు పైమాటే. స‌క‌ల సౌక‌ర్యాల‌తో అద్భుతమైన సేఫ్టీ ఫీచ‌ర్ల‌తో ఈ కార్ ప్ర‌పంచానికే త‌ల‌మానికంగా రారాజులా చెలామ‌ణి అవుతోంది. ముంబై మొద‌లు హైద‌రాబాద్ స‌హా మెట్రో న‌గ‌రాల్లో ల‌గ్జ‌రీ ప‌ర్స‌నాలిటీస్ మాత్ర‌మే ఇలాంటి కార్ల‌ను కొనుగులో చేస్తున్నారు.

టాలీవుడ్ లో ప్ర‌భాస్ .. రామ్ చ‌ర‌ణ్ లాంటి స్టార్లు లంబోర్ఘినిని క‌లిగి ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా త‌న స్నేహితుడు రామ్ చ‌ర‌ణ్ వ‌ద్ద‌కు వెళ్లి ఈ లంబోర్ఘి యూరస్ కార్ ని చూపించి ఆనందం వ్య‌క్తం చేశారంటూ ఒక‌టే ప్ర‌చారం జ‌రుగుతోంది. కార్ తో వెళ్లి రోజంతా చ‌ర‌ణ్ వ‌ద్ద‌నే తార‌క్ స‌మ‌యం గడిపార‌న్న‌ది క‌థ‌నాల సారాంశం. అయితే ఇది నిజ‌మా? అంటే...కానే కాద‌ని తెలిసింది.

ఇవ‌న్నీ త‌ప్పుడు క‌థ‌నాలు. ఆ కార్ ఎన్టీఆర్ ది కాదు. అత‌డు ఏడాది కాలంగా లంబోర్ఘినికి టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి ఎదురు చూస్తున్నారు. కానీ ఇంకా ఆ కార్ త‌న వ‌ద్ద‌కు చేర‌లేద‌ట‌. చ‌ర‌ణ్ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న‌ది వేరొక‌రి కార్ అని కూడా సోర్స్ ద్వారా తెలుస్తోంది. ప్ర‌స్తుతం సరికొత్త లంబోర్ఘినిని రామ్ చరణ్ ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న‌ప్ప‌టి ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అయ్యాయి. ఎన్టీఆర్ కార్ ఇంకా డెలివరీ జరగాల్సి ఉంది. అతను సమీప భవిష్యత్తులో కారును సొంతం చేసుకుంటాడ‌ని తెలిసింది.

కార్ లంటే టాలీవుడ్ హీరోల‌కు పిచ్చి

టాలీవుడ్ స్టార్ హీరోల్లో కింగ్ నాగార్జున ఆయ‌న వార‌సుడు చైత‌న్య‌ల‌కు కార్ లంటే విప‌రీత‌మైన పిచ్చి. చైతూ రేసింగ్ ని ఇష్ట‌ప‌డ‌తారు. నాగ్ కుటుంబీకులు తరచు కార్లు కొత్తవి కొంటూనే వుంటారు. పవన్ కళ్యాణ్ కి మ‌రీ అంత పిచ్చి లేదు కానీ.. ఇటీవ‌ల ఓ కొత్త కారు కొన్నారు. ఇక చ‌ర‌ణ్ గ్యారేజీలో చెప్పుకోద‌గ్గ కార్లున్నాయి. ప్ర‌భాస్ కూడా ప‌లు ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ల‌ను సొంతం చేసుకున్నారు. టాలీవుడ్ స్టార్ హీరోల‌తో పాటు హీరోయిన్లు ఇటీవ‌ల ల‌గ్జ‌రీ బ్రాండ్ కార్ల‌ను కొనుగోలు చేసేందుకు ఎంతో ఆస‌క్తిగా ఉన్నారు. యువ‌క‌థానాయిక ర‌ష్మిక మంద‌న ఇటీవ‌ల ఖ‌రీదైన కార్ ని సొంతం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. అమ‌లాపాల్ అప్ప‌ట్లో యానాం వెళ్లి బెంజి కార్ ని కొనుక్కున్నారు.