Begin typing your search above and press return to search.

'ఆర్ఆర్ఆర్'లో ఎన్టీఆర్ పులి ఫైట్ హైలైట్ కానుందా..?

By:  Tupaki Desk   |   8 July 2020 10:10 AM GMT
ఆర్ఆర్ఆర్లో ఎన్టీఆర్ పులి ఫైట్ హైలైట్ కానుందా..?
X
టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి దేశమంతా ఒకవిధంగా ఊహించుకుంటుంటే.. మీ ఊహకు అందకుండా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. దేశమంతా ఈ సినిమా దేశభక్తి గురించి ఉంటుందని భావించారు. కానీ అది నిజం కాదని రాజమౌళి స్వయంగా క్లారిటీ ఇచ్చారు. రాంచరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా దేశభక్తికి సంబంధించింది కాదని, కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య స్వచ్ఛమైన స్నేహం గురించి మాత్రమే సినిమా సాగుతుందని చెప్పుకొచ్చారు. ఈ మాటలు విన్న ప్రతీ ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. అదేంటి స్నేహం గురించి తీసే సినిమాలో అల్లూరి, కొమరం భీమ్ లు ఎందుకని అడగగా.. చెప్పాను కదా ఇది కల్పిత కథ అంటూ జవాబిచ్చాడు రాజమౌళి.

ఈ కథ 1919-22 మధ్య ప్రాంతంలో ఒకేసారి ఇంట్లో నుండీ వెళ్లిపోయిన ఈ ఇద్దరు యోధులు.. ఆ మూడు నాలుగేళ్లు ఏం చేసారనేది మెయిన్ కథాంశం అంటూ చెప్పుకొచ్చాడు రాజమౌళి. ఇక ఈ చిత్రానికి 'రౌద్రం రణం రుథిరం' అనే టైటిల్ ను ఫైనల్ చేసాడు. ఈ సినిమాను దాదాపు 400 కోట్ల భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రాంచరణ్ పుట్టినరోజు సందర్భంగా చిత్రయూనిట్ విడుదల చేసిన 'భీమ్ ఫర్ రామరాజు' వీడియోకి అద్బుతమైన ట్రెండ్ సృష్టించింది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ గురించి ఓ వార్త హల్చల్ అవుతోంది. ఇందులో ఎన్టీఆర్ పులితో ఫైట్ చేయనున్నాడట. ఆ సీన్ లీక్ అయిందని పుకార్లు వస్తున్న నేపథ్యంలో ఈ భారీ ఫైట్ సినిమాకే హైలైట్ కానుందని అంటున్నారు. ఇందులో ఎన్టీఆర్ వీరోచితంగా గాయాలతో పోటీ పడనున్నాడట. అధికారికంగా ప్రకటించనప్పటికీ అభిమానులలో అంచనాలు మాత్రం ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.