బర్త్ డే CDP తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ హంగామా

Wed May 18 2022 21:43:54 GMT+0530 (IST)

Jr NTR Birthday CDP

జూ.ఎన్టీఆర్.. తెలుగు చిత్ర పరిశ్రమలో పెద్ద పేరు. పరిశ్రమ అగ్రహీరోగా స్టార్ డమ్ ని కొనసాగిస్తున్నాడు. తన కెరీర్ లో 35 చిత్రాలకు పైగా నటించిన ఎన్టీఆర్ మే 20 నాటికి 39 ఏళ్లు పూర్తి చేసుకోనున్నారు. అతడి స్పెషల్ డేని సెలబ్రేట్ చేసుకునేందుకు అభిమానులు కామన్ డీపీ చిత్రాన్ని (CDP) విడుదల చేసారు.జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిమానం అర్థం చేసుకోలేనంత విస్త్రతమైనది. ఇండస్ట్రీ బెస్ట్ నటుడిగా గొప్ప డ్యాన్సర్ గానే కాదు.. మాస్ లో బాస్ అని నిరూపించాడు. అందుకే అతడిని మ్యాన్ ఆఫ్ మాసెస్ అంటూ అభిమానులు ఎంతో ప్రేమతో పిలుచుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా భారీ ఫాలోయింగ్ ను కలిగి ఉన్న స్టార్ గా అతడి స్థానం ఎప్పటికీ పరిశ్రమలో పదిలంగా ఉంది. ఇన్నేళ్లలో అతని సినిమాలు భారీ గ్రాండ్ ఓపెనింగ్స్ తో అదరగొట్టాయి. బాక్సాఫీస్ వద్ద అసాధారణ వసూళ్లను తేగలిగే సత్తా ఉన్న హీరోగా అతడు ఇప్పటికే నిరూపించాడు.

అతడి సినిమా విడుదల రోజుల వేడుకలు అభిమానులకు పండుగను మించి అని చెప్పాలి. స్టూడెంట్ నంబర్ 1- ఆది- సింహాద్రి- యమదొంగ టెంపర్- అరవింద సమేత వీర రాఘవ- నాన్నకు ప్రేమతో వంటి కొన్ని చిత్రాలలో తన పవర్ ప్యాక్డ్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు. ఇటీవలే RRR విడుదలయ్యింది. ఈ సినిమా పాన్ ఇండియా కేటగిరీలో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ డమ్ ని ఆస్వాధిస్తున్నాడు.

ఈ చిత్రంలో యంగ్ టైగర్ స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో కనిపించారు. తదుపరి కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో అతడు భారీ పాన్ ఇండియా చిత్రానికి సన్నాహకాల్లో ఉండడంతో జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాడు. మే 20న బర్త్ డే జరుపుకోబోతున్న తారక్ కి అడ్వాన్స్ డ్ గా విషెస్ చెప్పేందుకు అభిమానులు ఉవ్విళ్లూరుతున్నారు. తాజా సీడీపీని అంతర్జాలంలో వైరల్ గా షేర్ చేస్తున్నారు. తారక్ టాలీవుడ్ లో ఇతర హీరోలందరికీ ఒక రియల్ ఛాలెంజర్. తదుపరి ఎలాంటి ఎత్తుగడలతో తన స్థానాన్ని మరో మెట్టు పైకి తీసుకెళతాడో వేచి చూడాలి.