Begin typing your search above and press return to search.

టాప్ హీరో సినిమాతో జాన్ అబ్రహం కొలీవుడ్ ఎంట్

By:  Tupaki Desk   |   14 Jan 2021 2:30 AM GMT
టాప్ హీరో సినిమాతో జాన్ అబ్రహం కొలీవుడ్ ఎంట్
X
హిందీలో స్టార్ నటుడిగా పేరున్న జాన్ అబ్రహం ఇప్పుడు కోలీవుడ్ లో కూడా అడుగు పెట్టబోతున్నాడు. తమిళంలో ఇటీవల తలా అజిత్ హీరోగా పింక్ రీమేక్ తో హిట్ కొట్టిన బోనీకపూర్ మరోసారి అజిత్ హీరోగా ఓ సినిమాను తీస్తున్నాడు. బైకు రైసింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రమిది. దీనికి 'వలిమై' అనే పేరు పెట్టారు. హెచ్.వినోద్ దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ముమ్మరంగా జరుగుతుండగా ఏ మూవీ లోకి జాన్ అబ్రహం ఎంట్రీ ఇస్తున్నాడు.

'వలిమై' సినిమాలో తెలుగులో ఆర్ఎక్స్ 100 సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కార్తికేయ విలన్ పాత్రలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి హ్యూమా ఖురేషి కథానాయికగా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహం ఓ అతిధి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో రేసర్ పాత్ర లో జాన్ అబ్రహం కనిపిస్తారట. బైక్స్ అన్నా, బైక్ రేసింగ్ అన్నా జాన్ అబ్రహంకి మొదటి నుంచి ఆసక్తి ఎక్కువ. వలిమై సినిమాకు బోనీకపూర్ నిర్మాతగా వ్యవహరిస్తున్న డంతో ఆయన కోరిక మేరకు జాన్ అబ్రహం ఈ సినిమాలో నటిస్తున్నట్లు తెలిసింది. కాగా జాన్ అబ్రహం కు ఇదే తొలి తమిళ సినిమా.

వలిమై లో హీరోగా నటిస్తున్న అజిత్ కూడా రియల్ లైఫ్ లో బైకు రేసరే. ఆయన సినీ కెరీర్ లోకి వచ్చిన తర్వాత కూడా బైక్ రేసింగ్ ని వదల్లేదు. పలు బైక్ రేసింగ్ కాంపిటీషన్ అజిత్ లలో పాల్గొన్నారు. ఇప్పుడు బైక్ రేసర్ గా అజిత్ యాక్షన్ ఫిల్మ్ చేస్తుండడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అజిత్ వరుస విజయాలతో దూసుకు వెళుతుండటంతో ట్రేడ్ లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.