టీజర్ టాక్: మనకు ఆటలెందుకు బావా?

Sat Jan 12 2019 12:41:05 GMT+0530 (IST)

Jersey Teaser

న్యాచురల్ స్టార్ నాని 'జెర్సీ' అనే టైటిల్ తో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడన్న సంగతి తెలిసిందే.  గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ కాసేపటి క్రితమే విడుదలైంది. 1.28 నిముషాల నిడివిగల ట్రైలర్ లో లేట్ వయసులో క్రికెటర్ కావాలనే తపనపడే క్రికెట్ ప్రేమికుడిగా నాని కనిపించాడు."నీ ఏజ్ ఇప్పుడు 36  అర్జున్.  ప్రొఫెషనల్స్ స్పోర్ట్స్ నుంచి రిటైర్ అయ్యే ఏజ్" అనే డైలాగ్ తో టీజర్ స్టార్ట్ అయింది. అంటే..  సుత్తి లేకుండా టీజర్ ఓపెన్ చెయ్యగానే సినిమా కాన్సెప్ట్ ను చెప్పేశాడు దర్శకుడు.  "పిల్లలని ఆడించే వయసులో మనకు ఆటలెందుకు బావా?" అని ఒకరు.. "ఎంత ప్రయత్నించిన ఇప్పుడు నువ్వేం చెయ్యలేవు. యూ హ్యాడ్ యువర్ ఛాన్స్ అండ్ ఇట్స్ ఓవర్ నౌ" అని మరొకరు.. ఇలా అందరూ అర్జున్ ను నిరుత్సాహపరిచేవారే.  "యూ ఆర్ ఎ లూజర్ అల్ యువర్ లైఫ్" అనిపించుకుంటూ నాని తన అశయన్ని ఎలా సాధించాడన్నదే ఈ కథ.  ఇక ఫైనల్ టచ్  "ఆపేసి ఓడిపోయిన వాడు ఉన్నాడు కానీ .. ప్రయత్నిస్తూ ఓడిపోయిన వాడు లేడు" అంటూ నాని ఇస్తాడు.  సినిమా క్యాప్షనే 'ఇట్స్ నెవర్ టూ లేట్ టు డ్రీమ్'.. దానికి తగ్గట్టే హీరో పాత్ర చిత్రణ ఉంది.

రొటీన్ వాసనలు లేకుండా ఈ జెనరేషన్ కు కనెక్ట్ అయ్యే ఇంట్రెస్టింగ్ థీమ్..  కాన్ ఫ్లిక్ట్ ఉన్న స్టొరీ అని అర్థం అవుతోంది.  స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ కావడంతో విజువల్స్ ఫ్రెష్ గా ఉన్నాయి.  అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డిఫరెంట్ గా ఉంది. మనకు బాగా ఇష్టమైనవి రెండు... ఒకటి సినిమా రెండు క్రికెట్.  రెండూ మిక్స్ చేసి.. అందులో న్యాచురల్ స్టార్ లాంటి నటుడు ఉంటే ఇక చెప్పేదేముంది.. ఒకసారి మీరు అర్జున్ గారి సిక్స్ కొట్టే షాట్ ను చూడండి.