Begin typing your search above and press return to search.

`జెర్సీ` ర‌మ‌ణ లాంబా బ‌యోపిక్ కాదు

By:  Tupaki Desk   |   17 April 2019 5:42 AM GMT
`జెర్సీ` ర‌మ‌ణ లాంబా బ‌యోపిక్ కాదు
X
క్రికెట్ మైదానంలో బంతి త‌గిలి మ‌ర‌ణించిన ర‌మ‌ణ లాంబ అనే ఆట‌గాడి క‌థ‌తో `జెర్సీ` సినిమా తెర‌కెక్కుతోందా? ఆయ‌న జీవిత‌క‌థ‌నే స్ఫూర్తిగా తీసుకుని ఫిక్ష‌నైజ్ చేశారా? అంటే అస్స‌లు కానే కాద‌ని చెప్పారు నేచుర‌ల్ స్టార్ నాని. గ‌త కొంత‌కాలంగా ఈ విష‌యంపై మీడియా స‌హా అభిమానుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అయితే అత‌డి క‌థ‌తో జెర్సీ సినిమాకి ఏమాత్రం సంబంధం లేద‌ని, ఇది అస‌లు బ‌యోపిక్ కేట‌గిరీకి చెంద‌ద‌ని నాని తెలిపారు. జెర్సీ క‌థ పూర్తిగా అర్జున్ చుట్టూ తిరిగే ఫిక్ష‌న్ క‌థాంశ‌మ‌ని నేడు హైద‌రాబాద్ సార‌థి స్టూడియోస్ లో జ‌రిగిన ఇంట‌ర్వ్యూలో నాని రివీల్ చేశారు. ఇది ర‌మ‌ణ లాంబ బ‌యోపిక్ అంటూ అధికారికంగా వీకీలో కూడా అప్ లోడ్ చేసేశారు క‌దా? అని ప్ర‌శ్నిస్తే .. వీకీలో ఇప్పుడు ఎవ‌రైనా అప్ లోడ్ చేసేస్తున్నారు. కానీ సినిమా రిలీజైన త‌ర్వాత తిరిగి దానిని అప్ డేట్ చేసేస్తారు. అంత‌వ‌ర‌కూ వేచి చూద్దాం అని అన్నారు నాని.

చిన్న‌ప్పుడు క్రికెట్ ఆడారా? అన్న ప్ర‌శ్న‌కు గ‌ల్లీ క్రికెట్ ఆడాను. ఇళ్ల‌లో సందుల్లో అంద‌రూ ఆడే ఆట అది. టీమ్ లో చివ‌రి ప్లేయ‌ర్ గా ఉండేది నేనే. స్కూల్.. కాలేజ్ డేస్ లో ఆడిన అనుభ‌వం ఉన్నా ఎక్స్ ట్రా ప్లేయ‌ర్ గా మాత్ర‌మే ఉండేవాడిన‌ని తెలిపారు. ఈ సినిమా కోసం హైద‌రాబాద్ బెస్ట్ శిక్ష‌ణ సంస్థ‌.. డేనియ‌ల్ క్రికెట్ అకాడెమీలో జాయిన్ అయ్యి నేర్చుకున్నాన‌ని నాని వెల్ల‌డించారు. ఆయ‌నే ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతున్నంత‌సేపూ సెట్స్ కి వ‌చ్చి అన్ని ర‌కాలుగా సాయం చేశార‌ని నాని వెల్ల‌డించారు.

ఈ సినిమాలో తెర‌పై మీ అబ్బాయి పేరు నాని క‌దా? అలా కావాల‌ని పెట్టారా? అన్న ప్ర‌శ్న‌కు అలాంటిదేం లేదు. అస‌లు గౌత‌మ్ ఈ క‌థ రాసుకున్న‌ప్పుడే అర్జున్, నాని పేర్లు రాసుకున్నాడ‌ట‌. నేను జాయిన్ అయ్యాకే తెలిసింది. నాని పాత్ర‌లో న‌టించిన ఆ కుర్రాడు అద్భుతంగా న‌టించాడు. సెట్ లో అత‌డు మాకు పెద్ద రిలీఫ్. త‌న‌లో ఉన్న ఎన‌ర్జీ అంతా ఇంతా కాదు. ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడు. చాలా ఠిఫిక‌ల్ బోయ్! అంటూ కితాబిచ్చేశారు నాని. రిలీజ్ ముందు ఎక్స్‌ ట్రీమ్ ఆనందంతో ఉన్నాను. రిలీజ్ ముందే స‌క్సెస్ అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంది. ఎల్లుండి దాకా వేచి చూడాల‌ని అనిపించ‌డం లేదు.. అని నాని ఎగ్జ‌యిట్ అయ్యారు. ఏప్రిల్ 19న జెర్సీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ‌వుతున్న సంగ‌తి తెలిసిందే.